NalgondaTelangana

మర్రిగూడ దళిత వనబోజన కార్యక్రమంలో అవినీతి… ఎస్సి వాడలకు దూరంగా ప్రోగ్రాం.

కెసిఆర్ ఆలోచనకు తూట్లు, జేబులు నింపుకున్న ఇంచార్జ్ లు..? అధికార పార్టీ పత్రిక విలేకరి జోక్యం, రగిలిపోయిన దళిత ప్రజలు...!

నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): మునుగోడులో రానున్న బై ఎలక్షన్స్ దళితుల పాలిట వరాలుగా మారాయి. ఒక పక్క దళిత బందు ప్రవేశపెడతారని నేతలు పలు ప్రోగ్రాంల ద్వారా ప్రజలకు వివరిస్తునే ఉన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మండల పరిధిలోని గ్రామాలలో దళిత వాడల నందు తెరాస పార్టీ వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు ప్రముఖ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.

Read More : రెడ్లకు రెడ్ కార్పెట్.. బీసీలకు చావు డప్పు! ఇదేందయా జగదీశ్ రెడ్డి..? మునుగోడులో కారును ముంచేస్తావా?

ఈ సందర్భంగా మర్రిగూడ మండలం నందు రెండవ విడత వనభోజన కార్యక్రమాలలో, ఇన్చార్జిల కారణంగా అంతర్గత గొడవలు తారా స్థాయికి చేరాయి. ఒక లక్ష 30 వేల రూపాయలు, మర్రిగూడ గ్రామంలో దళితుల కోసం ఖర్చు పెట్టాలని అధికార పార్టీ పత్రిక విలేకరి కి కొంతమంది నాయకులకు, కుల పెద్దలకు బాధ్యతలు అప్పజెప్పారని ప్రజలు అనుకుంటున్నారు. స్థానిక మర్రిగూడ మండలంతో పాటు మరో పది గ్రామాల నందు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే మర్రిగూడ నందు దళిత వాడలో నిర్వహించాల్సిన ఈ ప్రోగ్రాం, ఆ కాలనీలకు దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో విజయ గార్డెన్ నందు కార్యక్రమం ఏర్పాట్లు చేశారు.

Read More : మునుగోడులో బీజేపీ జోరు.. మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ క్లాస్

ఈ కారణం చేత కేవలం 50 శాతం మంది కూడా వన భోజనాలలో పాల్గొనలేదని, దళితుల కోసం ఇచ్చిన డబ్బులలో కేవలం 50 నుండి 60 వేల మధ్య మాత్రమే ఖర్చు చేసి, మిగతా డబ్బులు కొంతమంది నాయకులు జేబులు నింపుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. వచ్చిన కొంతమందికి మాత్రమే భోజనాలు పెట్టి, ఇంటికి పంపారు తప్ప ఎటువంటి అవగాహన అంశాలు తెలియపరచలేదని సమాచారం. చివరికి సాయంత్రం ఐదు గంటల సమయంలో నకిరేకల్, హుజూర్నగర్ నియోజకవర్గాల నుండి వచ్చిన ప్రత్యేక బృందాల ద్వారా అందుబాటులో ఉన్న కొందరికి మాత్రమే, తెరాస పార్టీ ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించారని తెలుస్తుంది. అధికార పార్టీ పత్రిక విలేకరి చేసిన తప్పిదం వల్ల ఎస్సీలలో అంతర్గత కలహాలు మొదలయ్యాయని వినికిడి. పెద్దరికం పేరుతో ప్రజల సొమ్ము తినడానికి మీరెవరు అంటూ, వనభోజనాలకు వచ్చిన వారు ఇంచార్జ్ లను ప్రశ్నిస్తున్నారు.

Read More : బీజేపీ నేతలను బట్టలిప్పి కొడతా.. పబ్లిక్ గా మంత్రి జగదీశ్ రెడ్డి బూతు పురాణం

గత ఎన్నికల్లో కూడా తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇదే తరహాలో ప్రజలకు కేటాయించిన కొన్ని లబ్ధిలు, లీడర్లే మింగేయడంతో ఓటమిపాలయ్యాడని, మళ్లీ ఇలాంటి వారినే పార్టీ పెద్దలు నమ్మడం, గాలిలో దీపం పెట్టినట్లే అని ప్రజల అభిప్రాయపడుతున్నారు. చుట్టు పక్కల ఉన్న గ్రామాలలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వనభోజన కార్యక్రమాలు, స్థానిక మండల కేంద్రంలో ఇరువర్గాల గొడవలకు తావు తియ్యడం, దళిత వాడలో కాకుండా కిలోమీటర్ దూరంలో వనభోజనాలు ఏర్పాటు చేయడం, అన్ని గ్రామాలకు హాజరైన చిరుమర్తి లింగయ్య ఈ గ్రామానికి మాత్రం హాజరు కాకపోవడం, పార్టీల తరుపున జరుగుతున్న ఈ కార్యక్రమాలను ఒక రిపోర్టర్ కి అప్పజెప్పటం చర్చనీయాంశంగా మారింది.

Read More : గాడ్సే భక్తులు గాంధీకి దండ వేయడమా : టిపిసిసి కార్యదర్శి, ఇన్చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి

వనభోజనాలకు ఎవ్వరూ రాకూడదని.. డబ్బులు మిగిలించుకోవాలని…ఫంక్షన్ హాల్ లో ప్రోగ్రాం ఏర్పాటు చేశారా..? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకు ముందే ఆరోపణలు ఎదురుకుంటున్న అధికార పార్టీ పత్రికా విలేఖరి హస్తం ఉన్నట్లు, ఈ అవినీతిలో వారి పాత్ర ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి..? ఏదేమైనా తెరాస పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడంపై అసలు మతలబు ఏంటని, అర్థం కాని స్థితిలో పడ్డారు ప్రజలు. దీనిపై తెరాస పార్టీ నాయకులు ఆరా తీసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమాలలో జరిగిన అవినీతిపై, సంబంధిత బాద్యులపై మరో ప్రత్యేక కథనంతో మీ ముందుకు.
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది.

ad 728x120 SRI copy - Crime Mirror

ఇవి కూడా చదవండి ..

  1. నవంబర్ 8న మునుగోడు పోలింగ్.. దసరాకి ముందే షెడ్యూల్ ?
  2. పదవులను ఆశించకుండా ప్రజాసేవయే లక్ష్యంగా పని చేసిన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
  3. ఈడి, సిబిఐలు బిజెపి జేబు సంస్థలుగా మారాయి… రంగారెడ్డి టి‌ఆర్‌ఎస్ నేతల ఆరోపణలు
  4. మంత్రి జగదీశ్ రెడ్డిపై బీసీల తిరుగుబాటు? మునుగోడులో కూసుకుంట్లకు మూడో స్థానమే!
  5. ప్రపంచ గుర్తింపు సాధించిన మలబార్ గోల్డ్ సంస్థ

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.