
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి కోర్టు ప్రతినిధి : బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. ఆమెను బతుకమ్మ ఆడకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో జరిగింది. బతుకమ్మ ఆడేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలోకి వెళ్లిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పలువురు న్యాయవాదులు ఆమెను అడ్డుకున్నారు. తమ సమస్యలు ఎప్పుడూ పట్టించుకోని మీరు.. ఇప్పుడెలా వస్తారంటూ న్యాయవాదులు నిలదీశారు. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
Read More : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేసీఆర్ కోవర్టా?
న్యాయవాదులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు న్యాయవాదులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినా న్యాయవాదులు వెనక్కి తగ్గకపోవటంతో వారిని అదుపులోకి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఇవి కూడా చదవండి …
- మర్రిగూడ దళిత వనబోజన కార్యక్రమంలో అవినీతి… ఎస్సి వాడలకు దూరంగా ప్రోగ్రాం.
- ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దావూద్ ఇబ్రహీం కంటే డేంజరట!
- నవంబర్ 8న మునుగోడు పోలింగ్.. దసరాకి ముందే షెడ్యూల్ ?
- పదవులను ఆశించకుండా ప్రజాసేవయే లక్ష్యంగా పని చేసిన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
- మంత్రి జగదీశ్ రెడ్డిపై బీసీల తిరుగుబాటు? మునుగోడులో కూసుకుంట్లకు మూడో స్థానమే!