
- తొలి, మలి దశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర
- కుల వృత్తులను కాపాడిన ఘనత బాపూజీకి దక్కింది
- క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న గొప్ప నేత బాపూజీ
- సామాజిక న్యాయవాదిగా కూడా సేవలు
క్రైమ్ మిర్రర్, ఆలేరు: పదవులను ఆశించకుండా గడ్డి పూసలాగా తీసేసి, ప్రజాసేవయే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆలేరులోని బాపూజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నిజాం ముందే బాంబు పేల్చిన ఘనత బాపూజీకే దక్కిందని అన్నారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కూడా లెక్కచేయకుండా రాజీనామా చేసిన వ్యక్తి బాపూజీ అని తెలిపారు.
పీవీ నరసింహారావు హయాంలో ముఖ్యమంత్రి పదవిలో పోటీలో ఉండమంటే నాకు పదవులు అక్కర్లేదు, ప్రజాసేవయే నా లక్ష్యం అని చెప్పారన్నారు. కులవృత్తులను కాపాడాలనే ఉద్దేశంతో నేత కార్మికులకు సంఘాలు ఏర్పాటు చేసి, సంఘాల ద్వారా వచ్చిన బట్టలను ఆప్కో కొనాలని డిమాండ్ చేశారు. మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలో జరుగుతున్న దీక్షలో చర్మం కొరుకుతున్న చలిలో కూడా 97 ప్రాయంలో కూడా దీక్షలో పాల్గొనడం తెలంగాణకే గర్వకారణం అని అన్నారు. తొలి దశ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు ప్రత్యేక రాష్ట్రం కోసం అడ్డం తగులుతుంటే, మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే, మా తెలంగాణ రాష్ట్రాన్ని మేమే పాలించుకుంటామని ఉద్యమంలో ప్రశ్నించడం జరిగిందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలిలకే కాకుండా యావత్ భారతదేశానికి ఆయన సేవలు అందించారిని ఆమె తెలిపారు. 1972లో బోనగిరి ఎమ్మెల్యేగా బాపూజీ ఈ ప్రాంతానికి ఎంతో సేవలు అందించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు బింగి నరసింహులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చిందికింది మల్లేశం, మాజీ జెడ్పిటిసి బోట్ల పరమేశ్వర్, ఆలేరు మాజీ సర్పంచ్ చింతకింది మురళి, ఆలేరు మాజీ సర్పంచ్ కందగట్ల నిర్మల నరేందర్, ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి బడుగు జహంగీర్, ఆలేరు కౌన్సిలర్ బేతి రాములు, కౌన్సిలర్ నాగలక్ష్మి సంతోష్, చింతకింది మురళి చంద్రకళ, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, మాజీ ఎంపిటిసి బింగి రవి లతా, మున్సిపల్ చైర్మన్ శంకరయ్య వైస్ చైర్మన్ మాధవి వెంకటేష్, సీనియర్ రిపోర్టర్ యంబ నరసింహులు, అడ్వకేట్ గొట్టిపాముల బాబురావు, పాశికంటి శ్రీనివాస్, పాశికంటి జనార్ధన్, ద్వారం శంకర్, చందు, భోగ సంతోష్, బేతి శ్రీనివాస్, ఎం.ఏ.ఇకబ్బల్, ఎజాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ మల్లేష్, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు బింగి రవి, ఆలేరు మాజీ సర్పంచ్ దాసి సంతోష్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పాశికంటి శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ, ఆలేరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు, బేతి రాములు, కందుల శ్రీకాంత్, దాసి నాగలక్ష్మి సంతోష్, జనరల్ సెక్రెటరీ సారాబు సంతోష్, బీజని మధు, కటకం మల్లేష్, జింకల భరత్, కందుల వినయ్, టింకు, మహమ్మద్, బన్నీ, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ కటకం బాలరాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hi there,
We run an Instagram growth service, which increases your number of followers both safely and practically.
– Guaranteed: We guarantee to gain you 400-1200+ followers per month.
– Real, human followers: People follow you because they are interested in your business or niche.
– Safe: All actions are made manually. We do not use any bots.
The price is just $60 (USD) per month, and we can start immediately.
If you are interested, and would like to see some of our previous work, let me know and we can discuss further.
Kind Regards,
Stephan