
క్రైమ్ మిర్రర్, ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఈడి ద్వారా వేదింపులను ఆపాలని రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ED CBi లాంటి సంస్థలను బీజేపీ తమ జేబు సంస్థలుగా వాడుకుంటుందని వారు ఆరోపించారు. దేశంలో తమకు వ్యతరేకంగా ఉన్న అన్నీ పార్టీల నాయకులపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈడి, సిబిఐల ద్వారా కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ కేంద్రంలోని బిజెపి నాయకత్వం భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీలో చేరితే చాలు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఏ కేసులు ఉండవనీ, బీజేపీ తమ నిరంకుశ పాలన తో దేశంలో అన్నీ రంగాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోని ప్రజా పౌర హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఆదాని, అంబానీ, ప్రధాని ముగ్గురు కలిసి దేశాన్నీ తెగ నమ్ముతున్నారని, ఎవ్వరైనా ప్రశ్నిస్తే చాలు EDలు, కేడిలను ప్రజా నాయకుల మీదకు ఉసిగొల్పుతున్నారని గజమెత్తారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఇలాంటి చిల్లర మల్లెర వేదింపులు చేయడం కుట్రలో బాగామే తప్ప.. మరొకటి కాదని అన్నారు. కావున ఇబ్రహీంపట్నం ప్రజలూ, ప్రజాస్వామికి వాదులు, మేధావులు బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
- మంత్రి జగదీశ్ రెడ్డిపై బీసీల తిరుగుబాటు? మునుగోడులో కూసుకుంట్లకు మూడో స్థానమే!
- ప్రపంచ గుర్తింపు సాధించిన మలబార్ గోల్డ్ సంస్థ