
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిది : తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార పార్టీకి చెమటలు పట్టే పరిస్థితి వచ్చింది. నియోజకవర్గంలో దాదాపు 67 శాతం ఉన్న బీసీ ఓటర్లు మంత్రి జగదీశ్ రెడ్డిపై తిరగబడుతున్నారు. దీంతో టీఆర్ఎస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. మంత్రి జగదీశ్ రెడ్డి తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది. బీసీ లీడర్లను ఆయన అణగదొక్కుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండు నెలలుగా మునుగోడులో తిరుగుతున్న మంత్రి.. బీసీ లీడర్లను అవమానిస్తున్నారనే టాక్ ఉంది. నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు బీసీ నేతలకు ఆహ్వానం అందలేదు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్ కే దిక్కు లేదంటే మిగితా బీసీ నేతలు పరిస్థితి ఏంటో ఊహించవచ్చు.
Read More : ప్రపంచ గుర్తింపు సాధించిన మలబార్ గోల్డ్ సంస్థ
మంత్రి జగదీశ్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న బీసీ లీడర్లు జూదు విదుల్చుతున్నారు. తాజాగా మాజీ బూర నర్సయ్య గౌడ్ కూడా సంచలన కామెంట్లు చేశారు. పార్టీ కార్యక్రమాలను కూడా సొంత కార్యక్రమాలు లాగా అనుకుంటే వాళ్లకు నష్టం తప్పదన్నారు. బూర నర్సయ్య గౌడ్ ని పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి పిలవకపోవడం అంటే మునుగోడు నియోజకవర్గం ప్రజలను అవమానించడమే అన్నారు. మునుగోడు టికెట్ అనేది అంత ముఖ్యమైనది కాదన్న బూర.. 6 నెలల పదవి కోసం ఇంత అవసరం లేదన్నారు. ఒకాయన పిలవనంత మాత్రాన నా స్థాయి తగ్గదు, వారి స్థాయి పెరగదు అంటూ పరోక్షంగా మంత్రి జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేశారు. అహంకారం అనేది వారి సొంత సమాధికి పునాది లాంటిదన్నారు. వ్యక్తిగత ఆహ్వానాలు, చిల్లర రాజకీయాలకు కొరకు తాను ఉండనన్నారు.తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడని.. మిగతా లిల్లీపుట్స్ ను పట్టించుకోనని స్పష్టం చేశారు బూర నర్సయ్య గౌడ్.
Read More : వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీ చేసేది అక్కడి నుంచే?
సోమవారం వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.చిన్న కులాల వారే పోరాటం చేయాలా.. పెద్ద కులపోడే పదవులు అనుభవించాలా అని వ్యాఖ్యానించారు. పెద్ద కులపోడే రాజ్యాధికారం చేయాలని ఎక్కడైనా ఉందా అంటూ కామెంట్ చేశారు.చిన్న కులం, పెద్ద కులం అంటూ కర్నె ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మునుగోడులో సంచలనంగా మారాయి. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతోనే కర్నె ఇలా కామెంట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read More : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేసీఆర్ కోవర్టా?
మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 67 శాతం మంది బీసీ ఓటర్లే. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరో 24 శాతం ఉన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్నా ఇప్పటివరకు మునుగోడు నుంచి బీసీ నేత ఎమ్మెల్యే కాలేదు. అందుకే ఈసారి బీసీ వాదం బలంగా వినిపిస్తోంది. బూర నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్, నారబోయిన రవి , కర్నాటి విద్యాసాగర్ మునుగోడు టికెట్ ఆశించారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. కూసుకుంట్ల కోసం గల్లీ గల్లీ తిరుగుతున్నారు. అయితే ప్రచారంలో ఆయన బీసీ లీడర్లను కలుపుకుని పోవడం లేదు. మండలాల వారీగా నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు వాళ్లను పిలవలేదు. మాజీ ఎంపీ బూర, కర్నె ప్రభాకర్ తమకు పిలుపు లేదని చెబుతున్నా మంత్రి తీరు మాత్రం మారలేదని అంటున్నారు.
Read More : ఢిల్లీలో కలిసిపోతున్న కాంగ్రెస్-టీఆర్ఎస్! మునుగోడులో ఏం జరుగుతుందో?
బూర, కర్నె ప్రభాకర్ లు భవిష్యత్ లో తనకు మంత్రి పదవికి పోటీ వస్తారనే భయంతోనే జగదీశ్ రెడ్డి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగదీశ్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న బీసీ సంఘాలు.. ఉప ఎన్నికలో తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి. స్థానికంగా ఉండే బీసీ నేతలు ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీపై బీసీలు తిరుగుబాటు చేయబోతున్నారనే చర్చ సాగుతోంది. టికెట్ ఇవ్వకపోయినా కనీసం సమావేశాలకు పిలవకపోవడం ఏంటనే ఆగ్రహం బీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డికి బీసీల సత్తా ఏంటో చూపిస్తామంటున్నాయి. బీసీ సంఘాలు.మునుగోడులో తాజాగా జరుగుతున్న పరిణామాలతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే మునుగోడు టీఆర్ఎస్ పార్టీది మూడో స్థానమేనన్న చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలవాలని కేసీఆర్ ప్లాన్! కాంగ్రెస్ ను చంపే కుట్రన్న రేవంత్ రెడ్డి
- బీసీ అభ్యర్థులకే ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వాలి
- మునుగోడులో కారు పంక్చరే! బీజేపీలో చేరిన టీఆర్ఎస్ ఎంపీపీ.. అదేబాటలో వందిమందికి పైగా సర్పంచ్ లు, ఎంపీటీసీలు
- జగదీశ్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్న కోమటిరెడ్డి.. మునుగోడు బైపోల్ ఏకపక్షమేనా?
- విడికేం పోయే కాలం…. పెన్షన్ సొమ్ము కోసం నాయనమ్మకు నరకం
8 Comments