
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్నలక్ష్యంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగానే క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.రాబోయే ఎన్నిల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డియే ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ కార్యకర్తలు సైతం అదే చెబుతున్నారు. గతంలో రెండు సార్లు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. 2018 ఎన్నికల్లో మాత్రం కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డితో ఆయన ఓడిపోయారు. తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయమే. అయితే ఏ సీటు నుంచి పోటీ చేస్తారన్నదే ఆసక్తిగా మారింది.
తాజాగా వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. రాబోయే ఎన్నికల్లో ఆయన కొడంగల్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ జోరు పెంచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. తాజాగా కొడంగల్‌లో చేరికలు ఊపందుకున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భారీగా హస్తం పార్టీలో చేరుతున్నారు. టీపీసీపీ చీఫ్ రేవంత్ సమక్షంలో మద్దూరు మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈసందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని..ఇప్పుడున్న ప్రజాప్రతినిధి ఏ సమస్యను పరిష్కరించలేదన్నారు. కొడంగల్ ప్రజలు అభివృద్ధి చేసే పార్టీలనే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
Read More : మునుగోడులో బీజేపీ జోరు.. మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ క్లాస్
కొడంగల్‌ను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని..సోనియా గాంధీ సైతం ఇదే ఆకాంక్షిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కలిసి కొడంగల్‌కు రావాల్సిన అభివృద్ధి పనులను ఆపారని మండిపడ్డారు. కృష్ణా-వికారాబాద్ రైలు ఎందుకు నిలిపివేశారో చెప్పాలన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 5 వేల ట్రాన్స్ ఫార్మర్లు తెచ్చి ..ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశామన్నారు. మళ్లీ అలాంటి అభివృద్ధి జరగాలంటే తనను గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీనిచ్చారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం రేవంత్..కొడంగల్ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేసీఆర్ కోవర్టా?
- ఢిల్లీలో కలిసిపోతున్న కాంగ్రెస్-టీఆర్ఎస్! మునుగోడులో ఏం జరుగుతుందో?
- మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలవాలని కేసీఆర్ ప్లాన్! కాంగ్రెస్ ను చంపే కుట్రన్న రేవంత్ రెడ్డి
- అల్లాపూర్ వివేకానంద నగర్ లో ధూంధాంగా బతుకమ్మ సంబరాలు
- బీజేపీ నేతలను బట్టలిప్పి కొడతా.. పబ్లిక్ గా మంత్రి జగదీశ్ రెడ్డి బూతు పురాణం
One Comment