
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి దూకుడుగా పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల ఫ్యామిలీనే ఆయన టార్గెట్. కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమని చెబుతారు రేవంత్ రెడ్డి. అయితే కేసీఆర్ తో పోరాడుతున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమిగా ఏర్పడితే ఏం చేస్తారన్న ప్రశ్నలు మొదటి నుంచి వస్తున్నాయి. ఈ విషయంలోనూ పలు సార్లు క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పని చేసేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు ఉండే ఛాన్సే లేదన్నారు.
Read More : మంత్రి జగదీశ్ రెడ్డిపై బీసీల తిరుగుబాటు? మునుగోడులో కూసుకుంట్లకు మూడో స్థానమే!
తాను కేసీఆర్ తో కలిసి పనిచేయడం కలలో కూడా జరగదన్నారు. తాను చెప్పడమే కాదు ఈ అంశంలో రాహుల్ గాంధీ నోటి నుంచి మాట వినిపించారు. వరంగల్ లో జరిగిన రైతు గర్జన సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు భవిష్యత్ లో ఏ విధమైన సంబంధాలు ఉండబోవని ప్రకటించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పనిచేసే అవకాశం లేదని రేవంత్ రెడ్డి పదేపదే చెబుతుండటం.. రాహుల్ గాంధీ కూడా అదే మాట చెప్పడంతో.. ఆ రెండు పార్టీలు కలవడం అసాధ్యమని అంతా భావించారు. కాని తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం మరోలా ఉన్నాయి.
కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ ముక్త భారత్ అంటూ నినదిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలో చర్చలు జరిపారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. అయితే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ కూటమి వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ మిత్రుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి దాదాపు మూడేళ్ల తర్వాత సోనియాను కలిసిన నితీష్.. జాతీయ రాజకీయాలపైనే చర్చించారు. సోనియాతో భేటీ తర్వాత మాట్లాడిన నితిష్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. ధర్డ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్ అనేవి ఉండవని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ కూటమిలోనే ఉంటానని నితీష్ క్లారిటీ ఇచ్చారు.
Read More : షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… కోమటిరెడ్డి మరో సంచలనం
ఇక హర్యానాలో ఇండియన్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాష్ చౌతాలా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి నితీష్ కుమార్ తో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కలుపుకుని ముందుకు వెళ్తామని ఈసభలో నేతలు సంకేతం ఇచ్చారు. నితీష్ లాలూ, శరద్ పవార్ వంటి పెద్ద నేతలే కాంగ్రెస్ తో కలసి నడవడానికి ఓకే చెప్పడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా అదే బాటలో నడవచ్చని అంచనా వేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి నడవడానికి తమకు అభ్యంతరం లేదని ఇటీవలే ములాయం సింగ్ యాదవ్ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న కొన్ని పార్టీలను సైతం తమతో కలిసివచ్చేలా చూస్తామని సోనియాతో నితీశ్, లాలూ మాట్లాడారని తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్, వైసీపీ, బీఎస్పీ, ఆప్, బీజూ జనతాదళ్, కశ్మీర్ లోని పీడీఎఫ్ పార్టీలను కాంగ్రెస్ కూటమిలో కలిసి వచ్చేలా చర్చలు సాగుతున్నాయని సమాచారం.
Also Read : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేసీఆర్ కోవర్టా?
జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే తన లక్ష్యమంటున్నారు కేసీఆర్. ఈ విషయంలోనే ఆయన ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, జేడీఎస్ అధినేత దేవేగౌడతో మంతనాలు సాగించారు. కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలతోనూ ప్రగతి భవన్ లో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. కేసీఆర్ తో మంతనాలు సాగించిన పార్టీల అధినేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో ఉంటామని చెప్పడంతో.. కేసీర్ కూడా ఆ కూటమిలో కలవాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజా పరిణామాలతో బీజేపీ నేతలు చెబుతున్నదే నిజం కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయకారిగా పని చేస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో మునుగోడు రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- అల్లాపూర్ వివేకానంద నగర్ లో ధూంధాంగా బతుకమ్మ సంబరాలు
- రెడ్లకు రెడ్ కార్పెట్.. బీసీలకు చావు డప్పు! ఇదేందయా జగదీశ్ రెడ్డి..? మునుగోడులో కారును ముంచేస్తావా?
- మునుగోడులో బీజేపీ జోరు.. మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ క్లాస్
- బీజేపీ నేతలను బట్టలిప్పి కొడతా.. పబ్లిక్ గా మంత్రి జగదీశ్ రెడ్డి బూతు పురాణం
- అధికార పార్టీ గుండాయిజం.. ఆపాలి.. వృద్ధులని చూడకుండా రాళ్లతో.. కర్రలతో దాడి చేస్తారా..??