
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చంపాలని బీజేపీ, టీఆరెస్ కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు గడ్డపై గెలవకపోతే కాంగ్రెస్ ను చంపాలనుకున్న వారి కుట్ర గెలుస్తదని… ఈ విషయాన్ని ప్రజలు గమనించి వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని బోటిమీది తండా, వాయిలపల్లి, జనగాం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన రోడ్ షో నిర్వహించారు. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కోరుకోలేదని..కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం ఈ ఉపఎన్నిక తీసుకొచ్చారని విమర్శించారు.
Read More : షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… కోమటిరెడ్డి మరో సంచలనం
ఈ ఉప ఎన్నికతో ప్రజలకు లాభం జరగాలి కానీ.. అలాంటి నాయకులకు కాదన్నారు. వేలాది ఎకరాలు భూములు గుంజుకుని గుంట నక్కల్లా టీఆరెస్ నాయకులు ఇక్కడ తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే టీఆరెస్, బీజేపీ నాయకులు మునుగోడులో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమస్యలపై చర్చించి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ పై బీజేపీ ఎందుకు కేసులు పెట్టడంలేదని నిలదీశారు. బీజేపీ,టీఆరెస్ రెండూ ఒక్కటేనని..మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని గెలిపించాలని కోరారు.
మునుగోడు గడ్డపై కాంగ్రెస్ గెలిస్తే.. 2023లో 100 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రెవన్తబ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ఆడబిడ్డ స్రవంతిని గెలిపిస్తే..వచ్చే కాంగ్రేస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామని చెప్పారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరిగాయని.. ఒక్కసారి కూడా బీజేపీకి డిపాజిట్లు వచ్చిన దాఖలాలు లేవని చెప్పారు రేవంత్. కొత్త సీసాలో పాత సారాలా.. రాజగోపాల్ రెడ్డి కొత్త స్టిక్కర్ తో ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను టీఆరెస్ ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తోందన్నారు.. మునుగోడు ప్రజలు కేసీఆర్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మనం పరాయి వాళ్ళలా బతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. కిరాయి వాళ్లు వచ్చి తెలంగాణను ఏలుకుంటున్నారని..వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు రేవంత్.
READ READ : మునుగోడులో బీసీల ఉమ్మడి అభ్యర్థి.. ప్రధాన పార్టీల్లో కలవరం?
తాను అనని మాటలను అన్నట్లుగా సీపీఐ నేత సాంబశివరావు చెబుతున్నారని రేవంత్ అన్నారు. తాను కమ్యూనిస్టులను ఎప్పుడూ అవమానించలేదని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీని లేకుండా చేయాలనుకున్న కేసీఆర్ కు మద్దతు ఎందుకు ఇస్తున్నారని మాత్రమే తాను ప్రశ్నించానన్నారు. తాను కమ్యూనిస్టులను అవమానపరిచినట్లు నిరూపిస్తే ధర్మ బిక్షం విగ్రహం ముందే ముక్కు నేలకు రాస్తానని రేవంత్ సవాల్ విసిరారు. కమ్యూనిస్టులకు తాము సహజ మిత్రులమని,కింది స్థాయి కార్యకర్తలు మద్దతు ఇవ్వాలని కోరారు.
Read More : జగదీశ్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్న కోమటిరెడ్డి.. మునుగోడు బైపోల్ ఏకపక్షమేనా?
మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పోడు భూముల సమస్యపై కోట్లాడి పట్టాలు ఇప్పించే బాధ్యత తమదేనన్నారు రేవంత్ రెడ్డి. మోదీ అయినా కెడీ అయినా.. కొట్లాడి పోడు భూములకు పట్టాలిప్పిస్తామన్నారు. కాంగ్రెస్ గిరిజనులకు ఎంతో గౌరవం ఇచ్చిందని ఆయన తెలిపారు. గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో టీఆరెస్, బీజేపీ గిరిజనులకు ఏమిచ్చాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ గిరిజనులకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజగోపాల్ రెడ్డి ఏం వెలగబెట్టారని…ఎనిమిదేళ్లుగా మంత్రిగా ఉన్న మూడడుగుల జగదీష్ రెడ్డి గిరిజనులకు ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి …
- రెడ్లకు రెడ్ కార్పెట్.. బీసీలకు చావు డప్పు! ఇదేందయా జగదీశ్ రెడ్డి..? మునుగోడులో కారును ముంచేస్తావా?
- మునుగోడులో బీజేపీ జోరు.. మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ క్లాస్
- బీజేపీ నేతలను బట్టలిప్పి కొడతా.. పబ్లిక్ గా మంత్రి జగదీశ్ రెడ్డి బూతు పురాణం
- అధికార పార్టీ గుండాయిజం.. ఆపాలి.. వృద్ధులని చూడకుండా రాళ్లతో.. కర్రలతో దాడి చేస్తారా..??
- గాడ్సే భక్తులు గాంధీకి దండ వేయడమా : టిపిసిసి కార్యదర్శి, ఇన్చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి
One Comment