
గ్రేటర్ హైదరాబాద్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎంగిలి పూవు బతుకమ్మను వాడవాడలా ఉత్సాహంగా జరుపుకున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ లో పూల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. అల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక వివేకానంద నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కాలనీకి చెందిన వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. వివిధ రకాల రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చి ఆడి పాడారు. వందలాది బతుకమ్మలను ఒకే దగ్గర పెట్టి పాటలు పాడుతూ ఆటలు ఆడారు మహిళలు. కోలాటం వేశారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ దాదాపు మూడు గంటల పాటు ఉత్సాహంగా ఆడారు. చిన్న పిల్లలు కోలాటం ఆడుతూ సందడి చేశారు.
అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసొద్దీన్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. గౌరమ్మకు పూజలు చేసిన అనంతరం మహిళలతో కలిసి ఆమె కాసేపు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకలకు అద్బుతంగా ఏర్పాట్లు చేశారంటూ నిర్వాహకులను కార్పొరేటర్ అభినందించారు. వివేకానంద చౌరస్తాలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో టీఆర్ఎస్ డివిజన్ కో ఆర్డీనేటర్ వీరారెడ్డి, వివేకానంద నగర్ కాలనీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్మరి శ్రీనివాస్, అల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మస్తాన్ రెడ్డి, వివేకానంద నగర్ ప్రెసిడెంట్ జగన్నాథం, రోశయ్య, రక్తం సుధాకర్ తో పాటు పలువురు కాలనీ నాయకులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ అందరిని ఆకట్టుకుంది. వివేకానంద విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన నిలువెత్తు బతుకమ్మ దగ్గర ప్రజలు సెల్పీలు దిగారు.
One Comment