
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిది : మంత్రి జగదీశ్ రెడ్డికి బడుగు, బలహీన వర్గాలంటే అలర్జీనా? బీసీ నేతలను ఎదగకుండా అణగదొక్కడమే ఆయన లక్ష్యమా? ఈ చర్చే ఇప్పుడు మునుగోడు నియోజరవర్గ జనాల్లో సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. దాదాపు రెండు నెలలుగా మునుగోడులోనే మకాం వేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తనను ఎక్కువగా టార్గెట్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా నియోజకవర్గంలోని గల్లీగల్లీ తిరుగుతున్నారు.
తన వ్యక్తిగత కక్షతో కోమటిరెడ్డిని ఓడించే కసితో ఆయన ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే మునుగోడులో ఆయన ప్రచారం చేయడంలో ఎవరికి అభ్యంతరం లేకపోయినా.. ఆయన వ్యవహారశైలే బీసీల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. బడుగు, బలహీన వర్గాల నాయకులను చిన్నచూపు చూస్తారనే ఆరోపణలు జగదీశ్ రెడ్డిపై మొదటి నుంచి ఉండగా.. తాజాగా మునుగోడులో జరుగుతున్న పరిణామాలతో అది నిజమేనని స్పష్టమవుతోంది.
Read More : బీజేపీ నేతలను బట్టలిప్పి కొడతా.. పబ్లిక్ గా మంత్రి జగదీశ్ రెడ్డి బూతు పురాణం
మునుగోడు నియోజకవర్గంలో రెడ్డి లీడర్లతో ఒకలా.. బీసీ నేతలతో మరోలా వ్యవహరిస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఇటీవలే చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం సహా కొందరు ఎంపీటీసీలు బీజేపీలో చేరారు. అయితే తర్వాత రోజే గట్టుప్పల్ లో పార్టీ మారిన నేతల చావు డప్పు తీయించారు జదగీశ్ రెడ్డి. లక్షలాది రూపాయలను ఖర్చు చేసి… మహిళలను కిరాయికి తీసుకువచ్చి కర్నాటి వెంకటేశం దిష్టిబొమ్మతో ర్యాలీ తీశారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు బీసీల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది నేతలు బీజేపీలో చేరారు.
వాళ్లలో రెడ్డి లీడర్లే ఎక్కువ. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి కూడా కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. కాని ఆయనకు చావు డప్పు తీయించలేదు మంత్రి జగదీశ్ రెడ్డి. పార్టీ మారిన ఇతర రెడ్డి లీడర్లకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కాని బీసీ పద్మశాలి వర్గానికి చెందిన కర్నాటి వెంకటేశం పార్టీ మారితే మాత్రం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వందలాది మందితో చావు డప్పు కొట్టించడం ఏంటనే చర్చ వస్తోంది. ఇక్కడే బీసీ నేతలంటే జగదీశ్ రెడ్డికి ఎంత వివక్ష ఉందో అర్ధమవుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి.
Read More : అధికార పార్టీ గుండాయిజం.. ఆపాలి.. వృద్ధులని చూడకుండా రాళ్లతో.. కర్రలతో దాడి చేస్తారా..??
చేరికల విషయంలోనే కాదు ప్రచారంలోనూ జగదీశ్ రెడ్డి తీరు బీసీలను అవమానించేలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మునుగోడు నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, నారబోయిన రవి, కర్నాటి విద్యాసాగర్ పోటీ పడ్డారు. బూర, కర్నెలు రాష్ట్ర స్థాయిలో కీలక నేతలు. అయితే మునుగోడులో అంతా తానే వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం ఎక్కడా బీసీ నేతలను పట్టించుకోవడం లేదు. సమావేశాలకు వాళ్లకు ఆహ్వానాలు అందడం లేదు. ఆత్మీయ సమావేశాలకు పిలవడం లేదు. కర్నె ప్రభాకర్ సొంత గ్రామం సంస్థాన్ నారాయణపురంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి ఆయనకు ఆహ్వానం లేదు.
మంత్రి జగదీశ్ రెడ్డి డైరెక్షన్ లోనే ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయన ఆదేశాలతోనే బీసీ నేతలకు ఆహ్వానాలు అందడం లేదని చెబుతున్నారు. సీనియర్ నేతలను సమావేశాలకు పిలవకపోవడంపై టీఆర్ఎస్ కేడర్ లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ ఎంపీ బూర. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్ లో తనకు మంత్రి పదవికి పోటీ వస్తారనే భయంతోనే జగదీశ్ రెడ్డి ఇలా చేస్తున్నారనే టాక్ వస్తోంది.
తనకు పార్టీ సమావేశాలకు ఆహ్వానం అందడం లేదని బూర నర్సయ్య గౌడ్ ఓపెన్ గానే వ్యాఖ్యానించారు. అయినా మంత్రి తీరు మాత్రం మారలేదు. బూరను కావాలనే జగదీశ్ రెడ్డి అవమానిస్తున్నారని గౌడ ప్రజలు భావిస్తున్నారు. బూరను అవమానిస్తున్న జగదీశ్ రెడ్డికి ఉప ఎన్నికలో తమ సత్తా చూపిస్తామని చెబుతున్నారు. జగదీశ్ రెడ్డి తీరుతో మునుగోడు నియోజకవర్గంలోని గౌడ ఓటర్లంతా టీఆర్ఎస్ కు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్టవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న కర్నె ప్రభాకర్ కు వేలాది మంది అభిమానులు ఉన్నారు. మునుగోడులో జరుగుతున్న పరిణామాలతో వాళ్లంతా మంత్రి జగదీశ్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఇకనైనా మంత్రి ఒంటెద్దు పోకడలు మానుకోవాలని.. లేదంటే నియోజకవర్గం మొత్తం తిరిగి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నారబోయిన రవి, కర్నాటి విద్యాసాగర్ కూడా మంత్రి తమను కావాలనే అవమానిస్తున్నారనే భావనలో ఉన్నారు.
Read More : షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… కోమటిరెడ్డి మరో సంచలనం
మునుగోడుకు సంబంధించి మరో అంశం కూడా ఉంది. మునుగోడు నుంచే నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి టికెట్ ఆశించారు. అయితే ఆయనను ప్రగతి భవన్ కు పిలుపించుకుని మాట్లాడారు సీఎం కేసీఆర్. దీని వెనుక మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నారంటున్నారు. టికెట్ ఆశించిన కృష్ణారెడ్డిని కేసీఆర్ తో కలిపించిన జగదీశ్ రెడ్డి.. బీసీ లీడర్ల విషయంలో మాత్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
మునుగోడులో వరుసగా జరుగుతున్న పరిణామాలతో బీసీ వర్గాలన్ని జగదీశ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని ప్రభావం ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. మరోవైపు రెడ్లకు రెడ్ కార్పెట్ వేస్తూ బీసీ లీడర్లకు చావుడప్పు కొట్టిస్తున్నా.. మునుగోడు నియోజకవర్దంలో రెడ్డీలంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే మద్దతుగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా జగదీశ్ రెడ్డి తీరుతో మునుగోడులో టీఆర్ఎస్ మునగడం ఖాయమనే చర్చే నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో బీజేపీ జోరు.. మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ క్లాస్
- మునుగోడులో బీసీల ఉమ్మడి అభ్యర్థి.. ప్రధాన పార్టీల్లో కలవరం?
- జగదీశ్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్న కోమటిరెడ్డి.. మునుగోడు బైపోల్ ఏకపక్షమేనా?
- మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
- ట్రాఫిక్ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!
3 Comments