
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి జగదీశ్ రెడ్డి వెంట రోజంతా తిరుగుతున్న నేతలు.. రాత్రికి రాత్రే జెండా మార్చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో రోజురోజుకు బీజేపీలో జోష్ పెరుగుతుండగా… అధికార పార్టీలో మాత్రం ఆందోళన పెరిగిపోతుందని తెలుస్తోంది.
Read More : బీజేపీ నేతలను బట్టలిప్పి కొడతా.. పబ్లిక్ గా మంత్రి జగదీశ్ రెడ్డి బూతు పురాణం
వలసలతో జోరు మీదున్న బీజేపీ మునుగోడులో మరింత జోరు దూకుడు పెంచింది. ఉప ఎన్నిక కోసం హైకమాండ్ ఏర్పాటు చేసిన హైకమాండ్ సమావేశమై ప్రచార వ్యూహం రూపొందించింది. స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ ఆధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గంగడి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. మునుగోడు లో ప్రచార వ్యూహంపై చర్చించారు. దసరా తర్వాత మునుగోడులో గడప గడపకు బిజేపీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో పాదయాత్ర ద్వారా ఓటర్లను పలకరించనున్నారు. లక్ష ఓట్లు టార్గెట్ గా ప్రచారం చేయబోతున్నారు కమలనాధులు.
బీజేపీకి వలసలు కొనసాగుతుండటంతో అధికార పార్టీలో కలవరం కనిపిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి అభయం ఇస్తున్నా నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారన్నది అర్ధం కావడం లేదని తెలుస్తోంది. మునుగోడుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం కేసీఆర్ పార్టీ గెలుపు అవకాశాలపై ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. రోజు రోజుకు పార్టీ పరిస్థితి దిగజారుతుందన్న సర్వే నివేదికలతో.. ఉప ఎన్నిక బాధ్యతలు చూస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని చెప్పారట. ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరకుండా ఎందుకు ఆపలేకపోతున్నారని మంత్రిపై మండిపడ్డారని టీఆర్ఎ్ వర్గాల సమాచారం.
Read More : షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… కోమటిరెడ్డి మరో సంచలనం
మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్ కు దగ్గరలో ఉంటుంది. మునుగోడుకు సంబంధించి 40 నుంచి 50 వేల మంది ఓటర్లు హైదరాబాద్ లో ఉంటారు. ఈ ఓట్ల విషయంలో జిల్లా టీఆర్ఎస్ నేతలు పూర్తిగా విఫలమయ్యారనే భావననలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. కొన్ని రోజుల క్రితమే అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఉంటున్న మునుగోడు ఓటర్ల కోసమే ఆ సమావేశం నిర్వహించారు.
ఈ భేటీకి వేలాది మంది ఓటర్లు హాజరయ్యారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి సమావేశానికి సంబంధించిన వివరాలను ఇంటిలిజెన్స్ కేసీఆర్ కు నివేదించిదట. ఇలాంటి సమావేశం ఎందుకు పెట్టలేదని మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ క్లాస్ పీకారని తెలుస్తోంది. ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకమైనప్పుడు.. వేలాది మంది వలస ఓటర్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని నిలదీశారట. మునుగోడులో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు అందించాలని నిఘా బృందాలను ఆయన ఆదేశించారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- జగదీశ్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్న కోమటిరెడ్డి.. మునుగోడు బైపోల్ ఏకపక్షమేనా?
- మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
- మావోయిస్టు అగ్రనేత భార్య లొంగుబాటు… సాయంత్రం డీజీపీ ఆధ్వర్యంలో మీడియా ఎదుట హాజరు
- గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై హైకోర్ట్ సంచలన నిర్ణయం….
- రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు ! పంటల సాగు సమయంలో
One Comment