
క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వృద్ధులని చూడకుండా ఓ ప్రజాప్రతినిధిగా ఉండి రాళ్లతో, కర్రలతో సభ్య సమాజం తలవంచుకునే విధంగా దాడి చేయడం చాలా బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులుమామిడి గ్రామంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వృద్ధ దంపతులపై ఎంపీటీసీ భర్త కుటుంబ సభ్యులు విచక్షణ రైతంగా దాడి చేసిన సంఘటనను ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులపై దాడి చేయడం అనేది టిఆర్ఎస్ కార్యకర్తల గుండాయిజానికి నిదర్శనమని అన్నారు. ఓ ప్రజా ప్రతినిధి అయ్యుండి సభ్యసమాజం తలవంచుకునే పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన వాళ్లం మాకు ఎమ్మెల్యే, మంత్రుల,సీఎం అండదండలు ఉన్నాయని ధైర్యంగా దాడులు చేస్తున్నారని ఇది సమంజసం కాదని చెప్పారు.
టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా ఇలాంటి గుండాగిరిని అధికారులను అడ్డుపెట్టుకొని పేదలపై చేసే దౌర్జన్యాలను ఆపాలని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ పై మండిపడ్డారు. తలారి యాదయ్య కొడుకు రాఘవేందర్ ను ఎంపీటీసీ భర్త జైలు నుండి వచ్చిన తరువాత చంపుత అని పోలీస్ స్టేషన్ లోనే బెదిరిస్తున్నారంటే ఎవరిని చూసుకొని వారికి నా ధైర్యం అని ఎందుకు అంత కక్ష రాఘవేందర్ కుటుంబం పై ఎంపీటీసీ భర్త దీనికి జవాబు చెప్పాలన్నారు. ఇంత జరిగిన బాధ్యులను అరెస్ట్ చేయకుండా పోలీసులే వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు చేశారు..
వికారాబాద్ జిల్లా ఎస్పీ వెంటనే ఈ ఘటన మూలాలు విచారించి అరెస్ట్ చేయకపోతే చాలా తీవ్రంగా బిజెపి పార్టీ తరఫున స్పందిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ రియల్ ఎస్టేట్ గుండాల ఆగడాలు పేదల ప్రజలపై భారీగా పెరుగుతున్నాయని అన్నారు. స్థానిక ఎస్సై అండతోనే ఇదంతా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని దీనిపై జిల్లా ఎస్పీకి స్పందించాలని తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలతో పేదలకు రక్షణ లేకుండా పోయిందని ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు టిఆర్ఎస్ను బొంద పెడతామని దుర్మార్గుల కోసం,రక్తం చిందించడం కోసం కాదు తెలంగాణ వచ్చిందని దుర్మార్గుల పాలన నుండి విముక్తి లభించే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ దాడులు నిలవరించకపోతే ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు సింగాపురం ప్రభాకర్ రెడ్డి, బిజెపి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, శంకర్ పల్లి మండలం అధ్యక్షులు రాములు గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విజయ్ రాజ్, బీజేపీ జిల్లా దళిత మోర్చా జనరల్ సెక్రటరీ పోతురాజు శ్రీధర్, ఎబివిపీ నాయకులు దగ్గుల శ్రీహరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… కోమటిరెడ్డి మరో సంచలనం
- అభిమానులను చితకొట్టి.. దర్జాగా టికెట్స్ కొన్న హైదరాబాద్ పోలీసులు!
- మునుగోడులో బీసీల ఉమ్మడి అభ్యర్థి.. ప్రధాన పార్టీల్లో కలవరం?
- జగదీశ్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్న కోమటిరెడ్డి.. మునుగోడు బైపోల్ ఏకపక్షమేనా?
- మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
One Comment