
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్ : గాడ్సే భక్తులు గాంధీని పూజించడ మా?, పరమత సహనాన్ని కోరుకున్నమహాత్మా గాంధీని, మతవిద్వేషకులు ఆరాధించడమా??, కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నాగోలులో గాంధీ విగ్రహానికి పూలమాల వేశారని టిపిసిసి కార్యదర్శి, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ పూలమాల వేయడంతో అపవిత్రమైన గాంధీ విగ్రహాన్ని జక్కిడి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలతో శుద్ధిచేసి, పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ … గాంధీజీని గాంధీయవాద మార్గాన్ని ఆచరించలేని బిజెపి నాయకులు, ఇప్పుడు గాంధీ మహాత్ముని దండ వేసి దండం పెట్టడాన్ని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
Read More : షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… కోమటిరెడ్డి మరో సంచలనం
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నాగోల్ లో మహాత్ముని విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేయడం వల్ల ఆ విగ్రహం అపవిత్రమయిందని అన్నారు. బండి సంజయ్ దండా వేసి దండం పెట్టడంతో అపవిత్రమైన గాంధీ విగ్రహాన్ని పాలతో శుద్ధిచేసి, తిరిగి పవిత్రం చేశామన్నారు. గాంధీని పొట్టన పెట్టుకున్న గాడ్సే వారసులైన బిజెపి నాయకులకు కొత్తగా మహాత్ముని పై ప్రేమ పుట్టుకొస్తుందని, ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయంలో భాగమేనని తెలిపారు. గాడ్సే భక్తులైన బిజెపి నాయకులు దేశంలో కులాల మధ్య మతాల మధ్యవిద్వేషాలు రగల్చి, దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారన్నారు.
Read More : అభిమానులను చితకొట్టి.. దర్జాగా టికెట్స్ కొన్న హైదరాబాద్ పోలీసులు!
బిజెపి నాయకులు చేస్తున్న మత విద్వేషాలను రూపుమాపి, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3750 కిలోమీటర్ల భారత్ జోడోయాత్రను చేపడుతున్నారని జక్కిడి ప్రభాకర్ రెడ్డి వివరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కుల, మత వైశమ్యాలను రూపుమాపుతూ, దేశ ప్రజలంతా ఏకతాటి పైకి తీసుకువచ్చి, భారతీయులంతా ఒక్కటేనని చాటి చెప్పడానికి, పరమత సహనాన్ని పెంపొందించడానికి రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు దేశ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందడంతోనే, బిజెపి నాయకుల గుండెల్లో దడ మొదలైందని చెప్పారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో బీసీల ఉమ్మడి అభ్యర్థి.. ప్రధాన పార్టీల్లో కలవరం?
- జగదీశ్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్న కోమటిరెడ్డి.. మునుగోడు బైపోల్ ఏకపక్షమేనా?
- మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
- భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు..
- ఫిరాయింపు దారుల దిష్టిబొమ్మల దహనం… చావు డప్పుతో భారీ ఊరేగింపు
4 Comments