
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో మరో కలకలం రేపారు సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కొంత కాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న కోమటిరెడ్డి కొన్ని రోజులుగా కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో తరుచూ కాంగ్రెస్ కు ఇబ్బంది పెట్టేలా కామెంట్లు చేస్తున్నా రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం సైలెంట్ అయ్యారు. సడెన్ గా మరోసారి బాంబ్ పేల్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సీనియర్ నేతపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు.
Read More : జగదీశ్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్న కోమటిరెడ్డి.. మునుగోడు బైపోల్ ఏకపక్షమేనా?
పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న షబ్బీర్ అలీని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన ప్రియాంకా గాంధీని కోరారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన తన లేఖలో వివరించారు. చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో షబ్బీర్ అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని కోమటిరెడ్డి ప్రస్తావించారు. ఈ కారణంగా షబ్బీర్ అలీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదే జరిగితే పార్టీ పరువు పోతుందని చెప్పారు. షబ్బీర్ ను ఇంకా పార్టీలోనే కొనసాగిస్తే ఆయన వల్ల పార్టీకి నష్టం జరగవచ్చని కూడా కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి …
3 Comments