
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో సంచలనం జరగబోతోందా? ప్రధాన పార్టీలకు కలవరం తప్పదా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉంది. నియోజకవర్గంలో 67 శాతం బీసీ ఓటర్లే. రాష్టంలోనే ఇది టాప్. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరో 24 శాతం ఉన్నారు. అంటే నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 90 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాల వారే. అయినా మునుగోడులో ఇప్పటివరకు అగ్రవర్గాల వారే గెలిచారు.
ఎనిమిది సార్లు రెడ్లు.. నాలుగు సార్లు వెలమలు గెలిచారు. అయితే ఈసారి ఎలాగైనా మునుగోడులో బీసీ జెండా పాతాలని ఆ వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. తమ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నాయి. కాని పార్టీలు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు రెడ్డీలనే బరిలోకి దింపుతున్నాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించారు. అధికార టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరే ఖరారైందనే ప్రచారం సాగుతోంది.
Read More : జగదీశ్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్న కోమటిరెడ్డి.. మునుగోడు బైపోల్ ఏకపక్షమేనా?
బీసీలు ఎక్కువున్న నియోజకవర్గంలో అన్ని పార్టీలు రెడ్లకే టికెట్లు ఇవ్వడంతో బడుగు, బలహీన వర్గాలు రగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీ వర్గాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్ని పార్టీల్లోని బీసీ నేతలు, బీసీ సంఘాల నేతలను ఏకం చేసి ఉమ్మడి అభ్యర్థిని నిలిపి బీసీ సత్తా చాటాలనే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు రహస్యంగా సమావేశం జరిపారని తెలుస్తోంది. అక్టోబర్ చివరలో మునుగోడు బైపోల్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఈసీ వర్గాల సమాచారం. నవంబర్ చివరి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా నియోజకవర్గంలోని బీసీ నేతలను ఏకం చేసి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించారని సమాచారం.అదే జరిగితే ప్రధాన పార్టీలకు కలకవరం తప్పదని చెబుతున్నారు.
Also Read : మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు చాలా మంది బీసీ నేతలు టికెట్ కోసం ప్రయత్నించారు. ఇందులో రాష్ట్ర స్థాయిలోని బలమైన నేతలు కూడా ఉన్నారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్ లు పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. నారబోయిన రవి, కర్నాటి విద్యాసాగర్ పేర్లు కూడా వినిపించాయి. కాంగ్రెస్ నుంచి జర్నలిస్ట్ సంఘం నేత పల్లె రవికుమార్ గౌడ్, చెరుకు సుధాకర్, పున్నా కైలాస్ నేత టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేశారు. బీజేపీ నుంచి మాత్రం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ లాంచఛనమైంది. అయితే పార్టీలు అధిష్టానాలు మాత్రం రెడ్లవైపే మొగ్గుచూపాయి. అయితే బీసీలను అణగదొక్కే కుట్రలో భాగంగానే ప్రధాన పార్టీల్లోని రెడ్డి లీడర్లంతా ఏకమై ఇలా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
Read More : భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు…
మునుగోడులో బీసీ గెలిస్తే జిల్లాలో తమకు గండంగా మారుతుందనే భయంతోనే అన్ని పార్టీల్లోని రెడ్డి లీడర్లంతా ఏకమై మునుగోడులో కుట్రలు చేస్తున్నారని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే బీసీలంతా ఏకమై అగ్రవర్గాల నేతల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపిస్తున్నారు. మునుగోడు నుంచి వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశించిన నేతలందరిని ఒకే తాటిపైకి తెచ్చి… వారిలో ఒకరిని బరిలో ఉంచే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలుస్తోంది. బీసీ నేతలే ఏకమై ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో సంచలన ఫలితం వస్తుందనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి …
- షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… కోమటిరెడ్డి మరో సంచలనం
- అభిమానులను చితకొట్టి.. దర్జాగా టికెట్స్ కొన్న హైదరాబాద్ పోలీసులు!
- అక్రమ మట్టి రవాణాలో రెవెన్యూ హస్తం…?
- మావోయిస్టు అగ్రనేత భార్య లొంగుబాటు… సాయంత్రం డీజీపీ ఆధ్వర్యంలో మీడియా ఎదుట హాజరు
- గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై హైకోర్ట్ సంచలన నిర్ణయం….
2 Comments