
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోరాడుతున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీకి మాత్రం వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో అంతా తానే వ్యవహిరిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెమటలు పట్టిస్తున్నారు.
కోమటిరెడ్డి ఇస్తున్న రోజుకో షాక్ తో జగదీశ్ రెడ్డికి నిద్రపట్టడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ నుంచి ఏకైక మంత్రిగా గత ఎనిమిదేళ్లుగా చక్రం తిప్పుతున్నారు జగదీశ్ రెడ్డి. కోమటిరెడ్డి సోదరులతో ఆయనతో తీవ్ర విభేదాలున్నాయి. జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డిని కలవడానికి కూడా ఇష్టపడలేదు రాజగోపాల్ రెడ్డి అందుకే మునుగోడుకు మంత్రి నిధుల ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జగదీషశ్ రెడ్డి. గత నెలన్నర రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేశారు.
Read More : మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
మునుగోడు నియోజకవర్గంలో కాళ్లకు బలపం పట్టుకున్నట్లుగా తిరుగుతున్నారు జగదీశ్ రెడ్డి. చిన్న చిన్న గ్రామాలు, వార్డుల్లో కూడా పర్యటిస్తున్నారు. ఇక పార్టీ నేతల విషయానికి వస్తే గ్రామ వార్డు సభ్యుడితోనూ స్వయంగా మాట్లాడుతున్నారు. మునుగోడులో కనిపిస్తున్న సీన్లతో పోటీ జగదీశ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్యే సాగుతుందనే చర్చ సాగుతోంది. స్థానికంగా పట్టున్న బీసీ లీడర్లను కూడా పట్టించుకోకుండా మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మునుగోడులో అంతా సానుకూలంగా ఉంది… అంతా తాను చూసుకుంటానంటూ సీఎం కేసీఆర్ దగ్గర జగదీశ్ రెడ్డి చెబుతున్నారని తెలుస్తోంది. అయితే మంత్రిగా అధికార దర్పంతో సాగుతున్న జగదీశ్ రెడ్డికి చుక్కులు చూపిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గంలో బలంగా ఉన్న నేతలను ఒక్కొక్కరికి కాషాయ కండువా కప్పేస్తున్నారు. మంత్రి తన మనుషులుగా చెప్పుకున్న నేతలు సైతం బీజేపీలో చేరడం అధికార పార్టీలో కలవరం రేపుతోంది.
Read More : మునుగోడు ఉప ఎన్నిక రేవంత్‌కు పరీక్ష… ఓడితే నష్టోపోయేది ముందగా రేవంతే
చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం కొన్ని రోజులుగా మంత్రి వెంటే తిరుగుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా మంత్రి తన కారులోనే కర్నాటిని తీసుకువెళ్లేవారు. ఆయన నాలుగు కోట్ల రూపాయల పనులు కూడా ఈ మధ్యే ఇచ్చారని తెలుస్తోంది. అయితే మంగళవారం మధ్యాహ్నం వరకు మంత్రి వెంటే ఉన్న కర్నాటి వెంకటేశం సాయంత్రానికే జంప్ కొట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. చౌటుప్పల్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ఉండగా.. కర్నాటి కోమటిరెడ్డి ఇంట్లో ఉన్నారు. బుధవారం చండూరులో జరగాల్సిన ఆత్మీయ సమావేస ఏర్పాట్లు చూడాల్సిన జడ్పీటీసీ… పార్టీకి గుడ్ బై చెప్పడంతో మంత్రి జగదీశ్ రెడ్డి షాక్ అయ్యారని తెలుస్తోంది. కర్నాటి ఇచ్చిన ఝలక్ నుంచి మంత్రి తేరుకునేలోపే మరో షాక్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ మండలానికి చెందిన నలుగురు సర్పంచ్ లను లాగేశారు. వాళ్లంతా కూడా మంత్రి జగదీశ్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారే.
Read More : మర్రిగూడ బిజెపిలో ముసలం…..పాత బిజేపి వర్సెస్ కొత్త బిజేపి
నెలన్నర రోజులుగా నియోజకవర్గంలోనే తిరుగుతూ అంతా అద్బుతందా ఉందని కేసీఆర్ దగ్గర గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి జగదీశ్ రెడ్డిని తాజా పరిణామాలు ఉక్కిరిభిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. త్వరలో మరికొందరు కీలక నేతలు జంప్ చేస్తారనే ప్రచారం సాగుతుండటంతో జగదీశ్ రెడ్డికి బీపీ పెరుగుతుందని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎవరెవరు టచ్ ఉన్నారన విషయాలను ఇంటిలిజెన్స్ ద్వారా తెప్పించుకుంటున్నారట మంత్రి. రాజగోపాల్ రెడ్డి ఇస్తున్న షాకులతో ఆగమాగమవుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి.. ప్రత్యేకంగా ఇంటిలిజెన్స్ టీమ్ ను మునుగోడులో మోహరించారని తెలుస్తోంది.
Read More : మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో కీలక భేటీ…. కూసుకుంట్లకే మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్!!
మంత్రి ఎంత చేసినా ఆయన పప్పులు ఉడకవని.. కోమటిరెడ్డి ఇచ్చే షాకులకు కుదేలు కావడం ఖాయమనే చర్చ నియోజకవర్దంలో సాగుతోంది. మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా మంత్రికి తగిన శాస్త్రి జరిగిందని మాట్లాడుకుంటున్నారు. ఎవరిని లెక్క చేయకుండా, బీసీ నేతలను పట్టించుకోకుండా పోతే పరిస్థితి ఇలానే ఉంటుందని అంటున్నారు. మంత్రి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని కొందరు గులాబీ నేతలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…. కేటిఆర్
- భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు…
- ఫిరాయింపు దారుల దిష్టిబొమ్మల దహనం… చావు డప్పుతో భారీ ఊరేగింపు
- అక్రమ మట్టి రవాణాలో రెవెన్యూ హస్తం…?
- మావోయిస్టు అగ్రనేత భార్య లొంగుబాటు… సాయంత్రం డీజీపీ ఆధ్వర్యంలో మీడియా ఎదుట హాజరు
4 Comments