
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో గురువారం ఉదయం 10 నుంచి టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. దాదాపుగా మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ టిక్కెట్ల కోసం పోటెత్తారు.
జింఖానా గ్రౌండ్స్ మెయిన్ గేట్ వైపు నుంచి అభిమానులు ఒక్కసారిగా లోపలికి రావడంతో.. భారీ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లడంతో తొక్కీసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. గాయాలపాలైన వారిలో యువతులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
Read More : షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… కోమటిరెడ్డి మరో సంచలనం
ఇక క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం వచ్చిన అభిమానులను లాఠీఛార్జ్ పేరుతో పోలీసులు చితకబాదారు. పోలీసుల దెబ్బలకు జనం మొత్తం జింఖానా గ్రౌండ్స్ నుంచి పారిపోయారు. గ్రౌండ్ మొత్తం ఖాళీ కాగానే.. హైదరాబాద్ సిటీ పోలీసులు కౌంటర్ దగ్గరికి వెళ్లి మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేశారు. ఓ ఇద్దరు పోలీసులు కౌంటర్ వద్ద నిల్చుని టికెట్స్ తీసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘దర్జాగా టికెట్స్ మొత్తం కొన్న హైదరాబాద్ పోలీసులు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘టికెట్స్ అన్ని రాజకీయనాయకులు, పోలీసులకేనా.. అభిమానులకు ఇవ్వరా’ అని ట్వీట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో బీసీల ఉమ్మడి అభ్యర్థి.. ప్రధాన పార్టీల్లో కలవరం?
- జగదీశ్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్న కోమటిరెడ్డి.. మునుగోడు బైపోల్ ఏకపక్షమేనా?
- మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
- బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…. కేటిఆర్
- భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు…