
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఖమ్మంలో లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కి వెనుక నుంచి ఇంజెక్షన్‌తో పొడిచి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది. ఇంజెక్షన్‌తో దాడి చేసి వ్యక్తిని చంపిన కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకొని విచారణ ప్రారంభించారు. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పలు కోణాల్లో దర్యాప్తు జరిపి, కేసులో పురోగతి సాధించారు. ఈ హత్యలో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు కాగా మరొకరు ఆర్ఎంపీ డాక్టర్ అని గుర్తించారు.
Read More : మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ తన పెద్ద కూతుర్ని ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించారు. జమాల్ భార్య ఇమాంబీ 3 రోజులుగా కుమార్తె వద్దే ఉంది. ఆమెను తీసుకొచ్చేందుకు సోమవారం ఉదయం బొప్పారం నుంచి తన బైక్‌పై బయలుదేరాడు జమాల్. ముదిగొండ మండలం వల్లభి సమీపంలోకి రాగానే ఇద్దరు వ్యక్తులు బైక్ ఆపి లిఫ్ట్ అడిగారు. తమ బండిలో పెట్రోల్ అయిపోయిందని, ఒకరికి లిఫ్ట్ ఇస్తే పెట్రోలు తీసుకొస్తామని చెప్పారు. దీంతో జమాల్ ఒకరిని తన బండిపై ఎక్కించుకొని బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లగానే వెనక కూర్చున్న మాస్క్ పెట్టుకున్న వ్యక్తి జమాల్ వీపు మీద ఇంజక్షన్‌తో పొడిచాడు. ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడంతో ఆయన తన బైక్ వేగాన్ని తగ్గించాడు. ఏం చేశావంటూ ఆయన ప్రశ్నిస్తుండగానే నిందితుడు పక్కకు దూకి వెనకాలే వస్తున్న బండెక్కి పారిపోయాడు.
Read More : బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…. కేటిఆర్
అలాగే కొంతదూరం ముందుకు వెళ్లిన జమాల్ తన వాహనాన్ని ఆపి, మంచి నీళ్లు ఇవ్వామంటూ రోడ్డు పక్కనున్న వారిని అడిగాడు. నీళ్లు తాగి తన భార్యకు ఫోన్ కలపాలని కోరాడు. కానీ, ఫోన్ కలవలేదు. తన కళ్లు బైర్లు కమ్ముతుండగా.. జరిగినదంతా అక్కడున్న వారికి చెప్పి కుప్పకూలాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. జమాల్ అల్లుడు లాల్ సాహెబ్ ఫిర్యాదు మేరకు ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలం నుంచి ఇంజెక్షన్ స్వాధీనం చేసుకున్నారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి మరీ, వెనుక నుంచి ఇంజెక్షన్ ఇచ్చి చంపిన ఘటన గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించడాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ కోణాలలో దర్యాప్తు నిర్వహించారు. పోలీసు బృందాలు తొలుత ముదిగొండ, చింతకాని మండలాల్లో తనిఖీలు చేపట్టాయి. కానీ, సోమవారం ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
Read More : భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు…
జమాల్ సాహెబ్‌కు మంచినీళ్లు ఇచ్చిన యువకులను విచారించారు. ఆ తర్వాత ఆ మార్గంలోని గ్రామాలు, మెయిన్ రోడ్డుపై ఉన్న పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. రెండో రోజు మరో కోణంలో విచారణ ప్రారంభించారు. జమాల్ సాహెబ్ కుటుంబ సభ్యులకు ఈ హత్యలో ఏమైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితులు తొలుత జమాల్ సాహెబ్ కంటే ముందు వెళ్లిన మైసయ్య అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. అతడు బండి ఆపినప్పటికీ, ఏదో చెప్పి ఎక్కకుండా పంపించేశారు. ఆ తర్వాత వచ్చిన జమాల్ బండిని ఆపి ఈ దారుణానికి ఒడిగట్టారు.
Read More : మునుగోడు ఉప ఎన్నిక రేవంత్‌కు పరీక్ష… ఓడితే నష్టోపోయేది ముందగా రేవంతే
ప్రాథమిక విచారణలో పోలీసులకు ఈ లీడ్ దొరికింది. నిందితులు పథకం ప్రకారమే జమాల్‌ను టార్గెట్ చేసి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగా మరింత లోతుగా దర్యాప్తు చేయగా మరిన్ని కీలక వివరాలు తెలిశాయి. జమాల్ కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్ డేటాను పరిశీలించగా.. అతడి భార్య ముగ్గురు వ్యక్తులతో ఎక్కువసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు తేలింది. జమాల్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని పక్కా ప్రణాళిక ప్రకారమే లిఫ్ట్ అడిగి చంపినట్టు తెలుస్తోంది. నిందితులు చింతకాని మండలం మున్నేటికి చెందినవారని తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఈడీ చేతిలో కేసీఆర్ బినామీల చిట్టా? సంతోష్, కవిత అరెస్ట్ తప్పదా?
- కొడాలి నానికి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మహిళా నేత!
- పావలా వడ్డీ రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి- మేయర్
- డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆరుగురికి జైలు శిక్ష
3 Comments