
క్రైమ్ మిర్రర్, నల్లగొండ : (munugode) మునుగోడు ఉప ఎన్నికలపై ప్రకటన రాకముందే.. పార్టీలు జోరు పెంచాయి. ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు వివిధ రకాలుగా దూసుకుపోతున్నాయి. సవాళ్లు విసరు తున్నాయి. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌లో లిక్కర్ దాడులు గుబులు పుట్టిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నాటికి ఇది తీవ్ర దుమారం లేపేలా కనిపిస్తోంది. రియల్టర్ శ్రీనివాసరావు ఖాతాలోంచి 200 కోట్లు ఢిల్లీకి చేరినట్లు ఇడి గుర్తించిన వ్యవహారం ఇప్పుడు హాట్టాపిక్‌గా మారింది. ఇది ఎటు దారి తీస్తుందో అన్న చర్చసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా అభ్యర్థి ఎంపికపై సిఎం కెసిఆర్ దృష్టి సారించారు. మంత్రి జగదీశ్ రెడ్డితో చర్చించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి( Kusukuntla Prabhakar Reddy ) పేరునే ఖరారుచేస్తారని తెలుస్తోంది. ఇక బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి చేరికలపై దృష్టి పెడితే… కాంగైస్ అభ్యర్థి స్రవంతి మాత్రం ఇప్పటి నుంచి పసుపుబొట్టు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒటరును కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
Read More : మునుగోడు బై పోల్ డేట్ ఫిక్సైందా? కేసీఆర్ అత్యవసర సమావేశం అందుకేనా?
బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ… కీలక నేతలపై ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో ఉన్న లీడర్లతో స్వయంగా మాట్లాడుతూ బీజేపీలో చేర్చుకునే పనిని ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు మునుగోడులో జోరుగా ఓటరు నమోదు సాగుతోంది. ఓటుకు 30వేలు వస్తుందన్నప్రచారం సాగుతోంది. అలాగే తులం బంగారం అంటూ కూడా పుకార్లు బయలుదేరాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల నుంచి బీజేపీలో భారీగా కార్యకర్తలు, నేతలు చేరారు. ప్రతిపక్షం లేకుండా చేసి కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారని రాజగోపాల్ ఆరోపించారు. మునుగోడు ప్రజల గొంతుకలో వుంటానని, ధర్మ యుద్ధంలో ప్రజలు తనకు మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు. అటు.. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి ఓటరును కలువాలన్న టార్టెట్‌తో క్యాంపెయిన్ సరళిని ముందుకు పోనిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి ( Palvai Sravanthi ) పాల్వాయి స్రవంతి.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు.
Read More : మునుగోడు ఉప ఎన్నిక రేవంత్‌కు పరీక్ష… ఓడితే నష్టోపోయేది ముందగా రేవంతే
ప్రజాసమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలుపు ముఖ్యమన్నారు. ఇకపోతే మునుగోడుకు ముందే అనేక కార్యాక్రమాలను చేపట్టిన బిజెపి మునుగోడు గెలుపు కోసం పెద్ద ప్లానే చేస్తోంది. ఇకపోతే మొత్తం తెలంగాన టార్గెట్‌గా అమిత్ షా వ్యూహాలు పన్నుతున్నారు. సెప్టెంబర్ 17న అమిత్ షా టూర్ షెడ్యూల్ చివరిక్షణంలో సడెన్‌గా మారింది. సెప్టెంబర్ 17న పెరేడ్ గ్రౌండ్‌లో ప్రోగ్రామ్ ముగిశాక… బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి… వెళ్లాలని అమిత్ షా అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారట. అంతకుముందు తెలంగాణ బీజేపీ ప్రత్యేక ఇంఛార్జ్ సునీల్ బన్సల్.. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు.
ఆ తర్వాత అమిత్ షా.. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లనున్నట్లు షెడ్యూల్ ప్రకటించారు. ఈటల తండ్రి మల్లయ్య మరణించిన నేపథ్యంలో కుటుంబసభ్యులను పరామర్శించారు కేంద్ర హోంమంత్రి. అంత వరకు ఓకే.. కానీ ఆ తర్వాతే.. అమిత్ షాతో ఈటల రాజేందర్ దాదాపు 20 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడారు… అప్పుడే.. ఆ 20 నిమిషాల్లోనే ఏదో జరిగిందని తెలంగాణ మొత్తం చర్చ జరుగుతోంది.
Read More : మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అవసరమైన కార్యచరణ నివేదికను అమిత్ షా చేతికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) అందించారన్నప్రచారం సాగుతోంది. 90 సీట్లు గెలవడమే లక్ష్యంగా మిషన్ 90 రిపోర్ట్ లో కీలక అంశాలను పొందుపరిచారని అంటున్నారు. ఆ రిపోర్ట్‌లో పాద్టి బలంగా ఉండి బలహీనమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్టీ బలహీనంగా ఉండి బలమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వివరాలు రిపోర్ట్‌లో క్షుణ్ణంగా వివరించారట…
Also Read : బ్యూరోక్రాట్లా… భజనపరులా! సూర్యాపేట ఎస్పీ, సంగారెడ్డి కలెక్టర్లు తీరుపై జనాల గుస్సా..
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు, ప్రత్యర్థి పార్టీల బలహీనతలు, విధాన పరమైన హామోల్లాంటివన్నీ అందులో చెప్పారట. ఈటల రాజేందర్ మాత్రం అమిత్ షాతో మాట్లాడిన విషయాలపై నోరు మెదపకపోవడం ఆసక్తితో పాటు.. టెన్షన్ కూడా పెడుతోంది. ఇకపోతే హుజూరాబాద్‌లో అనుసరించిన వ్యూహాన్ని మునుగోడులోనూ అనుసరించేలా ఈటెల ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదే క్రమంలో లిక్కర్ దాడులతో అధికార టిఆర్‌ఎస్‌లో గుబులు పుట్టిస్తున్నారు. ఈ దాడులు ఎటు దారితీస్తాయన్నది తెలియడం లేదు.
ఇవి కూడా చదవండి ….
- భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు…
- అక్రమ మట్టి రవాణాలో రెవెన్యూ హస్తం…?
- మావోయిస్టు అగ్రనేత భార్య లొంగుబాటు… సాయంత్రం డీజీపీ ఆధ్వర్యంలో మీడియా ఎదుట హాజరు
- గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై హైకోర్ట్ సంచలన నిర్ణయం….
- లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్‌తో హత్య చేసిన కేసులో కీలక మలుపు…
9 Comments