
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గంలో బిజెపి పరిస్థితి రోజురోజుకు అస్తవ్యస్తంగా తయారవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కాబోతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపికి భారీ షాక్ తగిలేలా వాతావరణం కనబడుతుంది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తన పదవికి రాజీనామా చేసి బిజేపిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి రాజీనామా అనంతరం బై ఎలక్షన్ కు సిద్ధమవుతున్న మునుగోడు నియోజకవర్గంలో, గత కొద్ది రోజుల క్రితం బిజేపీ గాలి గట్టిగానే వీచింది.
Read Also : మునుగోడు బై పోల్ డేట్ ఫిక్సైందా? కేసీఆర్ అత్యవసర సమావేశం అందుకేనా?
కోమటిరెడ్డి రాజీనామా చేస్తూ తన వెంట, ఆయా మండలాలలో కాంగ్రెస్ పార్టీ లీడర్లను వెంట తెచ్చుకున్నాడు. కలిసి ఉంటే కలదు సుఖం అనే విధంగా,కొన్ని రోజులు కలుపుకుపోయిన కోమటిరెడ్డికి, నేడు చుక్కలు కనపడుతున్నాయి అనే విషయంలో ఆశ్చర్యపోనవసరం లేదని లీడర్లు అనుకుంటూనే ఉన్నారు. ఎన్నో ఏండ్ల నుండి పార్టీ సిద్ధాంతాల కోసం, అహర్నిశలు శ్రమించిన బీజేపీ మండల నాయకులకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో మునుగోడు నియోజకవర్గ స్థాయిలో రచ్చ జరుగుతుంది. ఏ విషయం అయినా కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీ లోకి వచ్చిన లీడర్లకే చెప్పడం, వారికే కీరోల్స్ అప్పగించడం, సీనియర్ బిజేపి నాయకులకు నచ్చడం లేదనే వాదన వినపడుతుంది.
Also Read : మునుగోడు ఉప ఎన్నిక రేవంత్‌కు పరీక్ష… ఓడితే నష్టోపోయేది ముందగా రేవంతే
ఇదే పరిస్థితి నియోజకవర్గ స్థాయిలో గల అన్ని మండలాలలో కనపడుతుందనే చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మర్రిగూడ మండలం పేరు వినబడుతుంది, కాంగ్రెస్ పార్టీలో గల మాజీ ప్రజా ప్రతినిధులకు, మండల పార్టీ నాయకులు అయిన ఇద్దరికి మాత్రమే కోమటిరెడ్డి ప్రాధాన్యత ఇవ్వటం పార్టీలో చీలికలకు, వర్గాలకు అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. ఎన్నో ఏళ్ల నుండి పార్టీని నమ్ముకున్న నాయకులను మరిచి, నిన్నా మొన్న వచ్చిన నాయకుల పెత్తనం కార్యకర్తలు సైతం సహించటం లేదని అనుకుంటున్నారు. మర్రిగూడ ఇంచార్జ్ లు మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ లకు, దాసోజు లక్ష్మణ్ కు మండల బీజేపీ నాయకులు తమ అభ్యర్థనలను, కాంగ్రెస్ నుండి వచ్చిన ఇద్దరు నాయకులు చూపిస్తున్న వ్యతిరేకతలను వివరించి చెప్పినట్లు సమాచారం.
Read Also : ఏసీబీకి చిక్కిన బడంగ్పేట్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్…
కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నారని, పార్టీ కండువాలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి పనులు చేస్తున్నారని పిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. చాలా మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ఇక బీజేపీ పార్టీ లో ఇలానే కుమ్ములాటలు కొనసాగితే కోమటిరెడ్డి కి రాజకీయ సన్యాసమే అంటున్నారు అనుభవజ్ఞులు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే ఇష్టానుసారంగా బిజేపిలో నడవడం కుదరవని, సిద్ధాంతాలను వీడి పనులు చేస్తే పార్టీకే నష్టమని మరి కొంతమంది భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఈడీ చేతిలో కేసీఆర్ బినామీల చిట్టా? సంతోష్, కవిత అరెస్ట్ తప్పదా?
- కొడాలి నానికి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మహిళా నేత!
- గిరిజన రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేద్దాం…. ముఖ్యమంత్రి కేసిఆర్ కు బండి సంజయ్ సవాల్
- మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో కీలక భేటీ…. కూసుకుంట్లకే మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్!!
- సురక్షిత నగరాల జాబితాలో హైద్రాబాద్ మూడవ స్థానం…. నివేదికను పంచుకున్న పోలీస్ శాఖ
2 Comments