
క్రైమ్ మిర్రర్, చండూర్ : రాత్రికి రాత్రి బిజెపి లోకి ఫిరాయించిన చండూరు జడ్పిటిసి కర్నాటి వెంకటేశం, యంపిటిసిలు అవ్వారు గీతా శ్రీనివాస్, చేరిపల్లి భాస్కర్ లకు ఘోర పరాభవం ఎదురైంది. వారి ఫిరాయింపులను తట్టుకోలేక కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ గట్టుప్పల్ గ్రామంలో భారీ ఎత్తున శవయాత్ర నిర్వహించారు.
Read More : ఏసీబీకి చిక్కిన బడంగ్పేట్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్…
పిల్లా పాపలతో సహా ఊరికి ఊరు కదిలి వారు పార్టీ మారాడాన్నీ నిరసించారు. గట్టుప్పల్ లో అడుగు పెడితే సహించేది లేదు అంటూ పార్టీ మారిన కర్నాటి వెంకటేశం, అవ్వారి గీతా శ్రీనివాస్, చేరిపల్లి భాస్కర్ లను వారు హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి అన్నప్పుడు అది అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యం అవుతుందంటూ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
Read More : ఈడీ చేతిలో కేసీఆర్ బినామీల చిట్టా? సంతోష్, కవిత అరెస్ట్ తప్పదా?
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తాము టిఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతామంటూ నిరసన కారులు ప్రతిన పునారు. చివరిగా నిరసన కారులు బిజెపి లోకి ఫిరాయించిన వారి దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రోజా, అచ్చన శ్రీను, కౌన్సిలర్ అనేపర్తి శేఖర్, తెరాస నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు.
ఇవి కూడా చదవండి :
- కొడాలి నానికి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మహిళా నేత!
- పావలా వడ్డీ రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి- మేయర్
- మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
- బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…. కేటిఆర్
- భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు….
2 Comments