
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గుట్కా వ్యాపారులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణలో గుట్కా, పాన్‌మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై ఎలాంటి నిషేధం అమలులో లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గుట్కా వ్యాపారులపై కేసులు పెట్టే అధికారం పోలీసులకు లేదని వ్యాఖ్యానించింది. పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తు చేసిన హైకోర్టు.. గుట్కా ఉత్పత్తుల తయారీ, సరఫరా, విక్రయదారులపై కేసులు పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది.
రాష్ట్రంలో గుట్కాతో పాటు పలు పొగాకు ఉత్పత్తులపై నిషేదం ఉందంటూ పోలీసులు తమను వేధిస్తున్నారని హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన నితేష్ కుమార్‌తో పాటు నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందిన ఐదుగురు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
Read More : మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లలిత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గుట్కాను సీజ్ చేసే అధికారం లేనప్పటికీ పోలీసులు పదే పదే వేధిస్తున్నారని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గుట్కా, పాన్‌మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ జారీచేసిందని దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ పిటిషన్ దాఖలు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. ఈ నేపథ్యంలోనే మార్చి 31న గుట్కా నిషేధంపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిందని గుర్తుచేశారు. సుప్రీం స్టే విధించిన క్రమంలో రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తుల వ్యాపారంపై ఎలాంటి నిషేధం అమలులో లేదని స్పష్టం చేశారు. అయినప్పటికి పోలీసులు వ్యాపారులపై తరచూ దాడులు చేస్తూ సరుకును సీజ్ చేసి కేసులు పెడుతున్నారని న్యాయస్థానానికి వివరించారు.
Read More : బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…. కేటిఆర్
పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పొగాకు ఉత్పత్తుల నిషేధ నోటిఫికేషన్ అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన తర్వాత కూడా వ్యాపారులపై కేసులు పెడుతూ, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంపై మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలంటే లెక్కలేనట్లుందని అసహనం వ్యక్తం చేసింది. పోలీసులను చైతన్యపరుస్తామని గతంలో చెప్పినట్లే ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పడంపై ధర్మాసనం మండిపడింది. ఎప్పుడూ అదే మాట చెప్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులంటే లెక్క లేకపోతే ఎలాగని నిలదీసింది. కోర్టు ఉత్తర్వులపై సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించింది.
- భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు…
- ఫిరాయింపు దారుల దిష్టిబొమ్మల దహనం… చావు డప్పుతో భారీ ఊరేగింపు
- అక్రమ మట్టి రవాణాలో రెవెన్యూ హస్తం…?
- మావోయిస్టు అగ్రనేత భార్య లొంగుబాటు… సాయంత్రం డీజీపీ ఆధ్వర్యంలో మీడియా ఎదుట హాజరు
- లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్‌తో హత్య చేసిన కేసులో కీలక మలుపు….