
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మండలంలో అక్రమంగా మట్టి రవాణ రోజు రోజుకు అధికం అవుతుంది. గుట్టలను తోడి యద్దేచ్చగా మట్టి రవాణా జరుగుతున్నా, చూసి చూడనట్లుగా రెవెన్యూ అధికారులు వ్యవహరించటం పై సర్వత్ర విమర్శలు వినపడుతున్నాయి.
Read More : మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
కేవలం బై ఎలక్షన్ ల గురించి పనులు చెయ్యటం తప్ప, గత నెల రోజుల నుండి ప్రజల నుండి వస్తున్న అభ్యర్థనలను, పిర్యాదులను పక్కన పెడుతున్నారని, ఇక కార్యాలయానికి రోజు వెల్లి రావటం తప్ప, పనులు జరగటం లేదని అందుకే కార్యాలయానికి కూడా ప్రజలు వెళ్ళటమే మానేశారని, అలాంటిది ఇక ఈ మట్టి రవాణా ఎలా ఆపుతారని అనుకుంటున్నారు. పగలు రాత్రి తేడాలు లేకుండా మట్టి రవాణా జోరుగా సాగుతున్నా, అధికారులకు సమాచారం అందించినా, మాకేం సంబంధం లేదనే విధంగా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తి ఉండటంపై పలు అనుమానాలకు దారి తీస్తుంది.
Read More : బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…. కేటిఆర్
ఈ రవాణాలో రెవెన్యూ సిబ్బందికి కూడా కొంత వాటా వెళ్తుందనే..? గుసగుసలు మర్రిగూడ చౌరస్తాలో జోరందుకున్నాయి. ఆఫీసుకు పోతే పిలిచినా పలికే అధికారే కరువయ్యారని అంటున్నారు ప్రజలు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి రవాణా జరుగుతుంది..!అనే అంశం ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
- భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు…
- ఫిరాయింపు దారుల దిష్టిబొమ్మల దహనం… చావు డప్పుతో భారీ ఊరేగింపు
- మావోయిస్టు అగ్రనేత భార్య లొంగుబాటు… సాయంత్రం డీజీపీ ఆధ్వర్యంలో మీడియా ఎదుట హాజరు
- గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై హైకోర్ట్ సంచలన నిర్ణయం….
- లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్‌తో హత్య చేసిన కేసులో కీలక మలుపు….
2 Comments