
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశ్వనగరంగా ఎదిగేందుకు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. దేశం నలుమూల నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్‌లో నిశ్చింతగా నివసిస్తున్నారు. వీటన్నింటికి ప్రధాన కారణం.. నగరంలోని శాంతి భద్రతలు. దేశంలో సురక్షిత నగరంగా హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచినట్టు తెలంగాణ పోలీసు శాఖ తాజా రిపోర్టు విడుదల చేసింది.
Read Also : ఇనుప రాడ్ తలపై పడింది…. 1.7 కోట్ల పరిహారం కోసం కోర్టుకు వెళ్ళింది
ఈ ఏడాది దేశంలోని ముఖ్య నగరాల్లో నమోదైన క్రైం కేసుల నివేదికను పోలీసు శాఖ పంచుకుంది. పది లక్షల జనాభాలో 2 వేల 599 కేసులతో దేశంలోని సేఫెస్ట్ సీటీ ల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. కేవలం వెయ్యి 34 కేసులతో కోల్‌కత్తా మొదటి స్థానంలో నిలవగా.. 2 వేల 568 కేసులతో పూణె రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత సురక్షిత నగరం గా నిలిపేందుకు తెలంగాణ పోలీసు శాఖ మొత్తం తీవ్రంగా కృషి చేస్తోందని ఆ శాఖ తన అధికారిక ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. అతి తక్కువ క్రైం రేటు నమోదవటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. పది లక్షల మంది జనాభాలో నమోదైన క్రిమినల్ కేసుల నివేదికను పోలీసు శాఖ పంచుకుంది. అత్యధికంగా 18 వేల 596 కేసులతో నివేదికలోనే ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.
Also Read : దుమ్ము లేపుతున్న బూర పర్యటనలు…..
హైదరాబాద్‌లో హత్యలు, అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. వాటిని పోలీసులు వీలైనంత త్వరగా ఛేదిస్తున్నారు. అలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇటీవల కమాండ్ కంట్రోల్ టవర్స్‌ను ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా నిఘా పెట్టేందుకు ప్రంపచస్థాయి టెక్నాలజీతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. నగరంలోని మూడు కమిషనరేట్‌ల పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. క్రైం రేటును తగ్గించేందుకు నిరంతరం గస్తీ కాస్తున్నారు. మత కలహాలు, ఉగ్ర చర్యలకు తావు లేకుండా.. పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలన్నింటి ఫలితమే.. హైదరాబాద్‌కు దేశంలోనే సేఫెస్ట్ సిటీగా మూడో స్థానం దక్కింది.
ఇవి కూడా చదవండి :
- జూబ్లీహిల్స్ ఘటనలో మహిళే మహానటి…. వెలుగులోకి ఊహించని ట్విస్ట్
- మునుగోడు టిఆర్ఎస్ లో ఎవరికీ వారే… ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నించని మంత్రి, ఎమ్మెల్యేలు
- వ్యభిచారం చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలకు గుండు… నల్గొండ జిల్లాలో దారుణం
- బ్యూరోక్రాట్లా… భజనపరులా! సూర్యాపేట ఎస్పీ, సంగారెడ్డి కలెక్టర్లు తీరుపై జనాల గుస్సా..
- మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?
One Comment