
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించారు. వాళ్లిద్దరు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ మాత్రం కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంది. అయితే సడెన్ గా మంగళవారం ప్రగతి భవన్ లో మునుగోడుపై సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా నేతలతో చర్చించారు. తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే సడెన్ గా సీఎం కేసీఆర్ మునుగోడుపై సమావేశం జరపడానికి బలమైన కారణం ఉందంటున్నారు.
Read More : పావలా వడ్డీ రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి- మేయర్
అక్టోబర్ లో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ కు ఢిల్లీ వర్గాల నుంచి సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల కమిషన్ ఒక స్థానం ఖాళీ అయితే.. ఆ సీటుకు ఆరు నెలల లోపు ఎన్నిక జరపాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏమైనా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉంటే వాటితోపాటు కలిపి నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. వాటితోపాటే మునుగోడు ఉప ఎన్నిక కూడా జరుగుతుందనే అంతా భావిస్తున్నారు. కానీ, అప్పటికంటే బాగా లేట్ అవుతుందని.. ముందే నిర్వహిస్తే బాగా కలిసొస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఆ దిశగానే షెడ్యూల్ రాబోతుందని అంటున్నారు.
Read More : మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో కీలక భేటీ…. కూసుకుంట్లకే మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్!!
తెలంగాణ విమోచన దినోత్సవాల కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా… హరిత ప్లాజాలో రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగానే మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందన్న దానిపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.డేట్ చెప్పకపోయినా.. అక్టోబర్ చివరిలో షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందని హింట్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు అనుకుంటే ఈసీ నుంచి ఎప్పుడైనా షెడ్యూల్ వస్తుంది. దీంతో అమిత్ షా చెప్పిన సమయంలోనే ఉప ఎన్నిక రావడం ఖాయమని భావిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందులో భాగంగానే జిల్లా నేతలతో కీలక మీటింగ్ పెట్టారని అంటున్నారు.
Read More : సురక్షిత నగరాల జాబితాలో హైద్రాబాద్ మూడవ స్థానం…. నివేదికను పంచుకున్న పోలీస్ శాఖ
షెడ్యూల్ వచ్చాకే అభ్యర్థి ప్రకటన ఉటుందని చెప్పి.. అప్పటిదాకా పార్టీ పరంగానే ప్రచారం నిర్వహించాలని సూచించారని తెలుస్తోంది. అభ్యర్థి ఖరారు విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును మునుగోడు అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసిన కేసీఆర్.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాతే అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు కూడా బలమైన కారణం ఉంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గంలో చాలామంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ప్రకటన చేసినా ఇబ్బంది తప్పదనే భావించే కేసీఆర్ అలా ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడు ఉప ఎన్నిక రేవంత్‌కు పరీక్ష… ఓడితే నష్టోపోయేది ముందగా రేవంతే
- ఏసీబీకి చిక్కిన బడంగ్పేట్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్…
- ఈడీ చేతిలో కేసీఆర్ బినామీల చిట్టా? సంతోష్, కవిత అరెస్ట్ తప్పదా?
- కొడాలి నానికి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మహిళా నేత!
3 Comments