
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ టీఆరెస్ లో ఎవరికీ వారే యమునా తీరే చందంగా పరిస్థితి తయారయింది. నియోజకవర్గ పరిధిలో మూడు గ్రూపులు, ఆరు పంచాయితీలు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. గ్రూపులన్నీ కలుపుకొని ఐక్యతారాగం ఆలపించడంలో మునుగోడు టిఆర్ఎస్ నాయకత్వం పూర్తిగా విఫలమయ్యిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడు లో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ను దూరం పెడుతున్నారని పలువురు మండిపడుతున్నారు.
Read Also : వ్యభిచారం చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలకు గుండు… నల్గొండ జిల్లాలో దారుణం
మంత్రి తమని పార్టీ కార్యక్రమాలలో భాగస్వాములు చేయడం లేదని బూర నర్సయ్య గౌడ్ ఏకంగా మీడియా ముందే వాపోయిన విషయం తెలిసింది. ఇక కర్నె ప్రభాకర్ నేరుగా ఎవరిపై విమర్శలు చేయకపోయినప్పటికీ, పార్టీ కార్యక్రమాలలో తనకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, కచ్చితంగా విజయం సాధించాలని భావిస్తుండగా… జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మండల ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో పాటు, ద్వితీయ శ్రేణి నేతలను కలుపుకపోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Also Read : మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?
ఇటీవల సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఇదే విషయాన్ని పార్టీ గ్రామ శాఖ నాయకులు, మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా… తప్పకుండా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని హామీ ఇచ్చిన జగదీశ్వర్ రెడ్డి, అటువంటి ప్రయత్నం ఏమి చేయడం లేదని పలువురు పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇక మండల ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు సైతం, పార్టీ గ్రామ మండల స్థాయి నాయకుల మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నాలు చేయడం లేదంటున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో పార్టీ లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గ్రూప్ లు ఉన్నాయి. మండలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు ఇస్తున్న ప్రాధాన్యత, కర్నె ప్రభాకర్ మద్దతు దారులకు ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Read Also : బ్యూరోక్రాట్లా… భజనపరులా! సూర్యాపేట ఎస్పీ, సంగారెడ్డి కలెక్టర్లు తీరుపై జనాల గుస్సా..
అసలు కర్నె ప్రభాకర్ వర్గీయులను పార్టీ నాయకులుగా పరిగణించడం లేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. సంస్థాన్ నారాయణపురం లో జరిగిన కార్యక్రమంలో కర్నె ప్రభాకర్ వర్గీయులపై పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్యేలు స్పష్టంగా ప్రదర్శించారని స్థానిక టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ముఖ్య నేతల సమావేశం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సంస్థాన్ నారాయణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శికిల మెట్ల శ్రీహరి ఫోటోను కింది వరుసలో ముద్రించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధికి ఇవ్వవలసిన గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. శికిల మెట్ల శ్రీహరి, కర్నె ప్రభాకర్ ప్రధాన అనుచరుడు కావడం వల్లే, ఆయనకు పార్టీలో అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్థానిక టిఆర్ఎస్ నేతలు అంటున్నారు.
Also Read : తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగనుందా?
ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మండల ఇన్చార్జి ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న గొంగిడి సునీత, గాదరి కిశోర్ ల దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తమ మద్దతు లేకుండానే నారాయణపురం మండల పరిధిలో ఎలా మెజారిటీని సాధించగలరో ఇన్చార్జి ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, పార్టీ అభ్యర్థిగా ఎవరికి టికెట్ ఇచ్చిన గెలిపించడానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేసేందుకు ముందుకు వస్తున్న వారిని కలుపుకుపోయే ప్రయత్నం చేయక పోవడం విస్మయం కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా పార్టీ అగ్రనాయకత్వం మునుగోడుపై దృష్టి సారించి, ప్రత్యేకించి సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రూప్ తగాదాలను పరిష్కరించాలని స్థానిక టిఆర్ఎస్ నేతలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- వివిధ పార్టీల నుండి బీజేపీ లోకి భారీ చేరికలు
- ఖమ్మం జిల్లాలో దారుణం… లిఫ్ట్ అడిగి విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే పాదయాత్ర అప్పండి…. వైఎస్ షర్మిల సవాల్
- కాన్పు పోయమంటే కాటికి పంపారు… గర్భిణి పొట్టపై కాళ్లతో తొక్కిన నర్సులు
- గుట్టుగా గుట్కా…. చోద్యం చూస్తున్న అధికారులు
One Comment