
సాయి చంద్, క్రైమ్ మిర్రర్, నిఘా విబాగం : పిసిసి చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక బాలారిష్టాలను దాటుకుని గట్టిగానే ముందుకు సాగుతున్నారు. సవాల్ విసరే స్థాయిలో ముందుకు కదులుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు పన్నుతున్నారు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందన్నదే ప్రశ్న. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్‌కు పడడం లేదు. వారంటే గిట్టడం లేదు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామాచేయడం, బిజెపిలో చేరడం,ఉప ఎన్నికకు రంగం సిద్దం కావడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత నెలకొంది.
Read More : మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
ఇదే క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారు. మునుగోడులో పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా నిలపడంతో కాంగ్రెస్‌కు కొంత పట్టు దక్కింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఇక్కడ మంచి పేరుంది. అది కాంగ్రెస్‌కు కలసి వచ్చే అంశం. అయితే రేవంత్ దీనిని క్యాష్ చేసుకుని రాజగోపాల్‌రెడ్డిని ఓడించగలిగితేనే పిసిసి చీఫ్‌గా బలపడగలరు. మునుగోడు ఎన్నిక అన్నది ఓ రకంగా రేవంత్‌కు అగ్నిపరీక్ష లాంటిది. ఇక్కడ బిజెపి గెలిస్తే బిజెపి మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. ఓడిపోతే ఏదో కారణం చెప్పి తప్పించుకుంటుంది. అలగే టిఆర్‌ఎస్ గెలిస్తే కెసిఆర్‌కు మరింత బలం చేకూరుతుంది. బిజెపిపై పోరాటానికి టానిక్ వచ్చినట్లుగా భావించవచ్చు. ఓడితే అది కాంగ్రెస్ సీటు అని తప్పించుకోవచ్చు.
Read More : మునుగోడు బై పోల్ డేట్ ఫిక్సైందా? కేసీఆర్ అత్యవసర సమావేశం అందుకేనా?
కానీ రేవంత్ పరిస్థితి అలాకాదు. ఓడితే ఆయనను కాంగ్రెస్‌లో ఉన్న వారంతా కాకుల్లా పొడుస్తారు. ఓటమికి రేవంత్ కారణమని దెప్పిపొడుస్తారు. రేవంత్ వల్ల లాభంలేదని అధిష్టానం వద్ద చెవిలో జోరీగలాగా దూరి చెబుతారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ సీనియర్లను కలుపుకుని ముందుకు సాగారు. అలాగే దీక్షలు, ఆందోళనలతో హల్‌చల్ చేశారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా పార్టీ అధిష్టానం పావులు కదుపుతోందని సమాచారం. రాష్ట్ర పార్టీలో జవసత్వాలు నింపే సమర్దుడైన నేతగా రేవంత్ రెడ్డి ఇప్పటికే తనను తాను రుజువు చేసుకున్నారు. అధికార టిఆర్‌ఎస్‌ను ఎక్కడిక్కడ వివిధ సమస్యలపై నిలదీస్తున్నారు.
Read More : మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో కీలక భేటీ…. కూసుకుంట్లకే మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్!!
రాష్ట్ర పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించడం కోసం పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో కలసి ముందుకు సాగుతున్నారు. ఆయన కలపుకుని పోయే ప్రయత్నంలో ఉన్నా పార్టీలో కొంత వ్యతిరేకత తప్పడం లేదు. సీనియర్లను విశ్వాసం లోకి తీసుకుంటూనే జూనియర్‌లకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ధిక, అంగబలం కూడా నేతలకు ముఖ్యమే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయమే శిరోధార్యమని అంటున్నా ప్రతి ఒక్కరూ తమకున్న ప్రత్యేకతను చాటేలా పోటీ పడుతున్నారు. జగ్గారెడ్డి కూడా ఇప్పటికే తిరుగుబాటు ప్రకటించారు. రాష్ట్ర పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని మరికొందరు సూచిస్తున్నారు.
Read More : ఈడీ చేతిలో కేసీఆర్ బినామీల చిట్టా? సంతోష్, కవిత అరెస్ట్ తప్పదా?
అన్ని జిల్లాల్లోనూ పార్టీని బలోపేతం చేసేలా సమర్శలైన నేతలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలను కూడా పునర్వవస్థీకరించాల్సి ఉంది. మొత్తంగా కాంగ్రెస్‌లో మార్పులు తథ్యమని చెబుతున్నారు. అయితే ఇదంతా కూడా మునుగోడ ఉప ఎన్నిక తరవాతనే ఉంటుంది. అప్పటి వరకు నేతలంతా ఈ ఎన్నిక కోసం పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ నిర్ణయల మేరకే ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా కొంత దూకుడుగా వ్యవహరించి వెనక్కి తగ్గారు.
Read More : కొడాలి నానికి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మహిళా నేత!
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే వైఖరితో ఉన్నారు. కాకపోతే హైకమాండ్‌కు తలొగ్గుతామని అంటూనే ఎవరి ఎత్తుగడలు వారు వేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు. తమకు ప్రాధాన్యం దక్కకపోతే దారి చూసుకునేందుకు చాలామంది కాంగ్రెస్ నేతలు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ఇకపోతే కాంగ్రెస్‌ను వీడిన నేతలను తిరిగి రప్పించే పనిలో పిసిసి చీఫ్ రేవంత్ ఉన్నారని సమాచారం. అయితే వీరంతా తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారా అన్నది అనుమానమే. ఈక్రమంలో మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందన్నది కూడా ముఖ్యమే. అధికార టిఆర్‌ఎస్‌ను, బిజెపిని,కాంగ్రెస్‌లో అంతర్గగత శతృవులను తట్టుకుని నిలబడే సత్తా రేవంత్ ప్రదర్శించాలి. మునుగోడులో చావోరేవో అన్నట్లుగా సాగాలి. అప్పుడే ఆయనకు కలసివస్తుంది.
ఇవి కూడా చదవండి :
- గిరిజన రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేద్దాం…. ముఖ్యమంత్రి కేసిఆర్ కు బండి సంజయ్ సవాల్
- జూబ్లీహిల్స్ ఘటనలో మహిళే మహానటి…. వెలుగులోకి ఊహించని ట్విస్ట్
- మునుగోడు టిఆర్ఎస్ లో ఎవరికీ వారే… ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నించని మంత్రి, ఎమ్మెల్యేలు
- వ్యభిచారం చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలకు గుండు… నల్గొండ జిల్లాలో దారుణం
- మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?
One Comment