
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు కాక రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ స్థానంపై కన్నేశాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమతమ అభ్యర్థిని ప్రకటించగా.. టీఆర్ఎస్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
Read Also : సురక్షిత నగరాల జాబితాలో హైద్రాబాద్ మూడవ స్థానం…. నివేదికను పంచుకున్న పోలీస్ శాఖ
కేసీఆర్ పిలుపుతో మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి నిలుస్తుండటంతో వారికి ధీటుగా ఎవరిని నిలబడెదామనే అంశంపై కేసీఆర్ నాయకుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రెడ్డి సామాజికవర్గం అభ్యర్థిని నిలబెట్టాలా? బీసీల నుంచి నిలబట్టాలా? అనే అంశంపై కూలంకుషంగా చర్చించారు. బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
Also Read : ఇనుప రాడ్ తలపై పడింది…. 1.7 కోట్ల పరిహారం కోసం కోర్టుకు వెళ్ళింది
ఈ నేపథ్యంలో త్వరలోనే అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ కేడర్‌కు కూసుకుంట్ల అభ్యర్దిగా సంకేతాలు పంపారు కేసీఆర్. అటు మంగళవారం నుంచి మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది.
Read Also : దుమ్ము లేపుతున్న బూర పర్యటనలు…..
ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో కూసుకుంట్ల పేరును హైలైట్ చేయాలని మంత్రి జగదీష్ రెడ్డికి కేసీఆర్ సూచించినట్టు సమాచారం. దీంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్టే అనే వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటిస్తే ఇక మునుగోడులో రాజకీయం మరింత రంజుగా మారుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే చేరికలు, వరుస మీటింగ్‌లతో మునుగోడు రాజకీయం హాట్ హాట్‌గా మారింది.
ఇవి కూడా చదవండి :
- జూబ్లీహిల్స్ ఘటనలో మహిళే మహానటి…. వెలుగులోకి ఊహించని ట్విస్ట్
- మునుగోడు టిఆర్ఎస్ లో ఎవరికీ వారే… ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నించని మంత్రి, ఎమ్మెల్యేలు
- వ్యభిచారం చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలకు గుండు… నల్గొండ జిల్లాలో దారుణం
- గుట్టుగా గుట్కా…. చోద్యం చూస్తున్న అధికారులు
- బ్యూరోక్రాట్లా… భజనపరులా! సూర్యాపేట ఎస్పీ, సంగారెడ్డి కలెక్టర్లు తీరుపై జనాల గుస్సా..