
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: ఆసరా పెన్షన్ పథకం ద్వారా వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 1, 2వ డివిజన్లకు చెందిన 438మంది నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ఎర్రగట్టుగుట్ట వద్ద గల బాలాజీ గార్డెన్స్ లో మంగళవారం ఎమ్మెల్యే అరూరి పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కండ్లల్లో ఆనందం చూడటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.12 వేల కోట్లను పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. వృద్ధాప్య పెన్షన్ వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏండ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
- గిరిజన రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేద్దాం…. ముఖ్యమంత్రి కేసిఆర్ కు బండి సంజయ్ సవాల్
- మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్లో కీలక భేటీ…. కూసుకుంట్లకే మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్!!!
3 Comments