
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ మడికొండలోని వెంకటేశ్వర గార్డెన్స్ లో శ్రీ సత్య దేవ, శ్రీ వెంకటేశ్వర, అంబేద్కర్, శ్రీ స్లమ్ మహిళా సమాఖ్య మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సంఘాల 13వ వార్షిక మహా సభకు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు టీఆరెఎస్ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు మండల మహిళా సమాఖ్య భవనాలు, ప్రతీ గ్రామంలో మహిళా భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మహిళా పారిశ్రమిక వేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా అభివృద్ధి చేసి, మహిళల ద్వారా అన్ని రకాల పంటల కొనుగోళ్లు చేపట్టెందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి, మహిళా సంఘం ప్రతినిధులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
2 Comments