
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ పర్యటనలు మునుగోడు రాజకీయాలను తల కిందులు చేస్తున్నాయి. బిసి వాదంతో హారెత్తిపోతున్న ప్రజల నాడికి బూర నర్సయ్య ఆసరాగా నిలబడ్డాడని చెప్పుకోవచ్చు. బీహార్ నుండి పొట్టి తాటి విత్తనాల పంపిణిలో పార్టీలకు అతీతంగా బిసి లీడర్లు కలిసి కట్టుగా రావటం చూస్తుంటే, కారు జోరుకు బూరె డ్రైవర్ అయ్యుంటే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, పార్టీల నుండే కాకుండా, కూసుకుంట్ల అభిమానులు సైతం బిసి పిలుపుకు బందీ అయిపోయ్యారు.
Read Also : జూబ్లీహిల్స్ ఘటనలో మహిళే మహానటి…. వెలుగులోకి ఊహించని ట్విస్ట్
కాంగ్రెస్ నుండి, బీజేపీ పార్టీల నుండి రెడ్డిలకు టికెట్ ఇవ్వటంతో, తెరాస పార్టీ మరో మారు కూసుకుంట్ల టికెట్ పై పునరాలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అధికార టీఆరెఎస్ పార్టీ నియోజకవర్గంలో బిసిల మనసు దోచుకోవాలంటే బూరకు టికెట్ ఇవ్వటమే ఉత్తమం అనే విధంగా ప్రజల్లో ప్రస్తావన నడుస్తుంది. ఆశాభావులైన వారిలో కర్ణాటి విద్యా సాగర్ కూడా బూరకు మద్దతుగా ఉన్నట్లు వాతావరణం కనపడుతుంది. తాటి పొట్టి విత్తనాల పంపిణి కార్యక్రమంలో మొదటగా యరుగండ్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ సురమాంభ కంఠ మహేశ్వర స్వామి దేవాలయాని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ఆవరణలో తాటి విత్తనాలు నాటారు.
Also Read : మునుగోడు టిఆర్ఎస్ లో ఎవరికీ వారే… ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నించని మంత్రి, ఎమ్మెల్యేలు
ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుకుడపు ముత్యాలు అభ్యర్థన మేరకు ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ మెంబర్స్ ముద్దం శ్రీనివాస్, ఐతగోని అంజయ్య గౌడ్, జగదీశ్వర్ గౌడ్, శివ గౌడ్, జమ్ముల వెంకటేష్ గౌడ్, ఐతగొని సత్తయ్య, యాదయ్య, లాలు, కృష్ణ, ముత్యాలు పాల్గొన్నారు. అనంతరం నాయకులతో కలిసి మర్రిగూడ మండల కేంద్రం నందు పొట్టి తాటి విత్తనాలు నాటి నీరు పోసారు. గౌడ సోదరులను ఉద్దేశించి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Read Also : గుట్టుగా గుట్కా…. చోద్యం చూస్తున్న అధికారులు
ఈ ప్రోగ్రాంలో కర్నాటి విద్యాసాగర్, మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అనంతుల రాజు గౌడ్, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్, స్థానిక సర్పంచ్ నల్ల యాదయ్య, మండల గౌడ సంఘం కన్వీనర్ పందుల రాములు, మాజీ సర్పంచ్ చెరుకు లింగం గౌడ్, గౌడ సంఘ నాయకులు గుణగంటి శ్రీరాములు గౌడ్, బూరెల బిక్షపతి గౌడ్, అయిలి నర్సింహా, కొంపల్లి నాగరాజు గౌడ్, పందుల క్రిష్ణ, బాయికాడి ఏడుకొండలు , అయితగోని రేణుక వెంకన్న, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- వ్యభిచారం చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలకు గుండు… నల్గొండ జిల్లాలో దారుణం
- మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?
- బ్యూరోక్రాట్లా… భజనపరులా! సూర్యాపేట ఎస్పీ, సంగారెడ్డి కలెక్టర్లు తీరుపై జనాల గుస్సా..
- తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగనుందా?
- ఖమ్మం జిల్లాలో దారుణం… లిఫ్ట్ అడిగి విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య