
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: వరంగల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో మంగళవారం వరంగల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ బాబూలాల్ తెలిపారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన సయ్యద్ రహీం, రెడ్డెం వెంకట్ రెడ్డి, సింగారపు విశ్వనాథ్, దాసరి హరికృష్ణ, పాకాల శివాజీ, తోట రవిలకు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.రమేష్ బాబు రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
అదేవిధంగా కోర్టు వారితో పాటు మరో 30 మందికి రూ.52 వేల 500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ బాబులాల్ తెలిపారు. జైలు శిక్ష విధించిన వారిని మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- భరోసా ఇస్తున్న ఆసరా పెన్షన్లు- ఎమ్మెల్యే అరూరి
- సురక్షిత నగరాల జాబితాలో హైద్రాబాద్ మూడవ స్థానం…. నివేదికను పంచుకున్న పోలీస్ శాఖ