
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నిషేధిత గుట్కా వ్యాపారం పుల్లల చెరువు మండలంలో గుట్టుగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గుట్కాల నిషేధం అమలు చేస్తున్నప్పటికీ.. కొందరు అక్రమార్కులు మాఫియాను తలపించే విధంగా గుట్కా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. మాఫియా ఎత్తులు వేస్తూ.. నిషేధిక గుట్కాను కిరాణాషాపులకు చేరవేస్తున్నారు. పోలీసులు అక్కడక్కడా దాడులు చేసి పట్టుకున్నప్పటికీ.. వ్యాపారాన్ని అదుపు చేయలేకపోతున్నారు.
Read Also : వ్యభిచారం చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలకు గుండు… నల్గొండ జిల్లాలో దారుణం
బస్టాండ్ ప్రాంతాలుగా ఈ వ్యాపారం యధేచ్ఛగా సాగుతోంది. కొందరు వ్యాపారులు తమ ఇళ్లనే స్థావరాలుగా మార్చుకొని వ్యాపారం చేస్తున్నారు. ప్రజల అలవాటునే ఆసరాగా చేసుకొని ధరలను నాలుగింతలుగా అధికం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. పల్లెలను కేంద్రాలుగా చేసుకొని పుల్లల చెరువులో పలువురు వ్యాపారులు తమ గుట్కా సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని 2013 జనవరి 9వ తేదీ నుంచి ప్రభుత్వం గుట్కా, పొగాకు ఉత్పత్తుల పై నిషేధం విధించింది.
Also Read : మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?
గుట్కాలు విక్రయించడం చట్టరీత్యానేరం. వీటి వినియోగం ద్వారా గొంతు క్యాన్సర్ బారిన పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ నిషేధం ఎక్కడ కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగంగా విక్రయాలు కొనసాగుతున్నాయి. కానీ అధికారులకు కనిపించకపోవడం విచారకరం. ప్రభుత్వం గుట్కా నిషేధాన్ని అమలు చేసే బాధ్యతను మూడుశాఖలకు అప్పగించింది. రెవెన్యూ, పోలీసు, ఆహార తనిఖీ అధికారులు సంయుక్తంగా గుట్కా విక్రయాలను అడ్డుకోవాల్సి ఉంది.
Read Also : బ్యూరోక్రాట్లా… భజనపరులా! సూర్యాపేట ఎస్పీ, సంగారెడ్డి కలెక్టర్లు తీరుపై జనాల గుస్సా..
కానీ రెవెన్యూ, ఆహార తనిఖీ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో గుట్కా వ్యాపారులకు బాగా కలిసొచ్చింది. వ్యాపారులు లక్షల్లో లాభాలను ఆర్జిస్తున్నారు. వీటి ధరలను మూడు, నాలుగిందలు చేసి విక్రయిస్తున్నారు. రూపాయికే విక్రయించాల్సిన గుట్కాను రూ.10 వరూపాయలకు విక్రయించాల్సిన పొగాకు ప్యాకెట్ ను రూ.15 నుంచి 25 రూపాయల వరకు అమ్ముతున్నారు. అధికారులు మామూళ్ళ మత్తులో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగనుందా?
- వివిధ పార్టీల నుండి బీజేపీ లోకి భారీ చేరికలు..
- నగరంలో మరోసారి ఈడీ సోదాలు….
- ఖమ్మం జిల్లాలో దారుణం… లిఫ్ట్ అడిగి విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే పాదయాత్ర అప్పండి…. వైఎస్ షర్మిల సవాల్