
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈయాత్రలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే పురుగులు పడి పోతావని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also : మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో కీలక భేటీ…. కూసుకుంట్లకే మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్!!!
గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసిఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మీద నెపంతో సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకురావాలని టీఆర్ఎస్ పథకం రచిస్తోందని ఆక్షేపించారు. దమ్ముంటే గిరిజన రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేద్దాం రావాలంటూ కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దేశంలో ప్రజా సమస్యలు పట్టించుకోని ఒకేఒక్క సీఎం కేసీఆరే అని విమర్శించారు. లిక్కర్ సహా అన్ని స్కాముల్లోనూ కేసీఆర్ కుటుంబమే ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఎస్టీ అభ్యర్థి అయిన ద్రౌపది ముర్మును ఓడగొట్టాలని చూసిన కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గు చేటని సంజయ్ మండిపడ్డారు.
Also Read : సురక్షిత నగరాల జాబితాలో హైద్రాబాద్ మూడవ స్థానం…. నివేదికను పంచుకున్న పోలీస్ శాఖ
ఈ నెల 22న నిర్వహించనున్న నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు పెద్దఎత్తున హాజరుకావాలని బండి సంజయ్ కోరారు. ముగింపు సభకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. సెప్టెంబర్ 22న సాయంత్రం 4 గంటలకు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని LPT వెహికిల్ పార్కింగ్ యార్డులో బహిరంగ సభను నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఇనుప రాడ్ తలపై పడింది…. 1.7 కోట్ల పరిహారం కోసం కోర్టుకు వెళ్ళింది
- దుమ్ము లేపుతున్న బూర పర్యటనలు…..
- జూబ్లీహిల్స్ ఘటనలో మహిళే మహానటి…. వెలుగులోకి ఊహించని ట్విస్ట్
- మునుగోడు టిఆర్ఎస్ లో ఎవరికీ వారే… ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నించని మంత్రి, ఎమ్మెల్యేలు
- మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?
2 Comments