
బాలాపూర్ (క్రైమ్ మిర్రర్) : బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఆకుల అశోక్ 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసిబి డిఎస్పి సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం సరూర్నగర్ ప్రాంతానికి చెందిన దేవేందర్ రెడ్డి బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న తన రెండు గృహ నిర్మాణ పర్మిషన్ కు సంబంధించి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఆకుల అశోక్ ని సంప్రదించగా 60 వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది.
Read More : మునుగోడులో మారుతున్న సమాకరణాలు… పోటాపోటీగా బిజెపి, కాంగ్రెస్ నేతల ప్రచారాలు
విషయాన్ని ఈనెల 1న కంప్లైంట్ రాగా దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తులో లంచం డిమాండ్ కు సంబంధించిన ఆధారాలు లభించడం, 20వేల నగదు ముందుగానే తీసుకోవడం జరిగిందని మంగళవారం గృహ నిర్మాణదారుడు మిగతా 30 వేలు తీసుకొని టిపిఎస్ అధికారిని కలవగా ప్రవేట్ ఆర్కిటెక్ శ్రీనివాసరాజుకు డబ్బులు ఇవ్వమని చెప్పడంతో ఆర్కిటెక్ కు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం 30 వేల రూపాయల నగదును జప్తు చేసుకోవడం జరిగింది.
Read More : మునుగోడు ఉప ఎన్నిక రేవంత్‌కు పరీక్ష… ఓడితే నష్టోపోయేది ముందగా రేవంతే
టీపీఎస్ అధికారితో పాటు ప్రైవేట్ ఆర్కిటెక్ శ్రీనివాసరాజును కూడా అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి చంచలగూడ జైలుకు తరలిస్తామని తెలుపుతూ నాగోల్ ప్రాంతంలో ఉన్న టిపిఎస్ అధికారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని దీనిపై పూర్తి వివరాలు రావడానికి సమయం పడుతుంది అని, ప్రవేట్ ఆర్కిటెక్ శ్రీనివాస రాజు కార్పొరేషన్ కార్యాలయంలో పర్మిషన్ కోసం వచ్చే వారందరితో ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- ఈడీ చేతిలో కేసీఆర్ బినామీల చిట్టా? సంతోష్, కవిత అరెస్ట్ తప్పదా?
- కొడాలి నానికి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మహిళా నేత!
- అక్రమ మట్టి రవాణాలో రెవెన్యూ హస్తం…?
- రేవంత్ రెడ్డి, కవిత మధ్య వార్.. తెలంగాణలో రాహుల్ రచ్చ
- టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకాష్ రాజ్!
One Comment