
క్రైమ్ మిర్రర్, సంస్థాన్ నారాయణపూర్ : నారాయణపూర్ మండలం లోని పుట్టపాక, శేరిగూడెం, జనగాం, రాచకొండ, కోతులాపురం, పోర్లగడ్డతండా, ఐదుకోనల తండా, కంకణాల గూడెం ల నుండి టీఆరెయస్, కాంగ్రెస్, సిపిఐ పార్టీల నుండి 500 మంది కార్యకర్తలు సోమవారం నాడు బిజేపిలో చేరారు. నారాయణపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారికి కాషాయ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Read Also : నగరంలో మరోసారి ఈడీ సోదాలు…
అననతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పక్షం లేకుండా చేసి కెసిఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశాడని, 1400 యువకుల ఆత్మబలిదానాలు తో తెలంగాణ వస్తె కెసిఆర్ కుటుంబం రాజకీయ పాలన చేస్తున్నాడని అన్నారు. ప్రాజెక్ట్ ల పేరు మీద వేల కోట్ల రూపాయలు కెసిఆర్ కుటుంబం దోపిడీ చేసిందన్నారు. కెసిఆర్ ను గద్దె దింపాలంటే మోది, అమిత్ షా ల తోనే అవుతుందని బీజేపీ పార్టీ లో చేరానని, మునుగోడు ప్రజల గొంతుక క వుంటా,ధర్మ యుద్ధం లో తనకు మద్దతు తెలపాలని కోరారు.
Also Read : ఖమ్మం జిల్లాలో దారుణం… లిఫ్ట్ అడిగి విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య
నా రాజీనామా తో ఫామ్ హౌస్ లో పండుకున్న కెసిఆర్ ను మునుగోడుకు రప్పించనని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బందు పథకం పెట్టారు,మునుగోడు ఉప ఎన్నిక కు గిరిజన బందు పథకం తెస్తున్నాడని ఆయన విమర్శించారు. కుటుంబ పాలన అంతం కావాలంటే మునుగోడు ఉపఎన్నిక లో బీజేపీ పార్టీ నీ గెలిపించాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే పాదయాత్ర అప్పండి…. వైఎస్ షర్మిల సవాల్
- ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ నూతన డిప్యూటీ స్పీకర్ గా వీరభద్రస్వామి
- కాన్పు పోయమంటే కాటికి పంపారు… గర్భిణి పొట్టపై కాళ్లతో తొక్కిన నర్సులు
- యువతి గొంతు కోసిన ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ పీఏ
- కేసీఆర్ అభినవ అంబేద్కరట… బరి తెగించిన సంగారెడ్డి కలెక్టర్