
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జూబ్లీహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ పీఏ, అనుచరుడు విజయసింహా అనే వ్యక్తి మహిళను కత్తితో గొంతు కోసి వీరంగం సృష్టించాడు. మహిళను వెంబడించి ఇంట్లోకి ప్రవేశించి మరీ కత్తితో గొంతు, మెడపై దాడి చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Read Also : NTV చైర్మెన్ ను బహిష్కరించిన జూబ్లీహిల్స్ క్లబ్
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని.. పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు భర్త చెబుతున్నాడు. బోరబండ టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయసింహా నిన్న అర్ధరాత్రి సమయంలో వెంటాడి మరీ తన భార్య నిషా (35) గొంతు కోసి హత్యాయత్నం చేయబోయాడంటూ బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read : కేసీఆర్ అభినవ అంబేద్కరట… బరి తెగించిన సంగారెడ్డి కలెక్టర్
విజయసింహా తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని, గతంలో ఈ విషయమై తన భార్య చెప్పిందని.. కాల్ రికార్డింగ్స్ కూడా తన వద్ద ఉన్నట్లు నిషా భర్త చెబుతున్నారు. దాడికి కారణాలు మాత్రం తనకు పూర్తిగా తెలియలేదని.. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు అతను చెప్పారు. ఎమ్మెల్యే అనుచరుడు, పైగా రౌడీషీటర్లతో సంబంధాలు ఉండటంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- వైఎస్సార్ ను హత్య చేశారు.. నన్ను చంపాలని చూస్తున్నారు! షర్మిల సంచలన ఆరోపణలు..
- ఉద్యమకారుడి బిడ్డకు పేరు పెట్టి బట్టలు పెట్టిన కేసీఆర్
- ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే… బిల్డింగ్ పర్మిషన్ కోసం 10 వేలు డిమాండ్..
- గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు.. మోడీకి ఉరేనంటూ కేసీఆర్ సంచలన ప్రకటన
- నాణ్యతా లోపం విరిగిపడ్డ బ్రిడ్జ్…. రాకపోకలకు అంతరాయం, ఇబ్బంది పడుతున్న ప్రజలు.