
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేకున్నా గత నెలన్నర రోజులుగా నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ నేతల వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఉప ఎన్నిక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ బీజేపీ నేతలకు ఇదే చెప్పారని తెలుస్తోంది. బీజేపీకి పూర్తి అనుకూలంగా లేకపోవడం వల్లే ఉప ఎన్నికను లేట్ చేయాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారని అంటున్నారు.
Read More : వ్యభిచారం చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలకు గుండు… నల్గొండ జిల్లాలో దారుణం
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడమే ఖాయమే. ఆయన నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు. ఆయన సమక్షంలో వలసలు కొనసాగుతున్నాయి. అమిత్ షా సభ తర్వాత బీజేపీకి వచ్చిన ఊపు ప్రస్తుతం కనిపించడం లేదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన పాల్వాయి స్రవంతి మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పీసీసీ ముఖ్య నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో క్రమంగా కాంగ్రెస్ బలపడుతుందనే టాక్ వస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలో చేరిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కొందరు తిరిగి సొంత గూటికి వస్తున్నారని అంటున్నారు.
Read More : ట్రాఫిక్ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!
అధికార టీఆర్ఎస్ లో మాత్రం అభ్యర్థి విషయంలో గందరగోళం కొనసాగుతోంది. మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం అంతా తానే మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనకు టికెట్ వస్తుందన్న ధీమాలో ప్రచారం చేసుకుంటున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి మద్దతుతో కూసుకుంట్లకే టికెట్ ఖరారైందని గతంలో ప్రచారం జరిగింది. మునుగోడు సభలో కేసీఆర్ ఆయన పేరును ప్రకటిస్తారని కూడా వార్తలు వచ్చాయి. కాని సభలో కేసీఆర్ అభ్యర్థి పేరు ఎత్తకుండానే ముగించారు. అయితే తాజాగా గులాబీ పార్టీలో సీన్ మారిపోయిందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి అభ్యర్థులను బరిలో దింపడంతో.. సీఎం కేసీఆర్ వ్యూహం మార్చారని అంటున్నారు. నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉండటంతో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
Also Read : అప్పుల పాలై కూలీ పనికి వెళ్తున్న సర్పంచ్
మునుగోడు నియోజకవర్గంలో 67 శాతం మంది బీసీ ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరో 23 శాతం మంది ఉన్నారు. మునుగోడులో ఓసీ ఓటర్ల శాతం కేవలం 10 లోపే. అంటే మొత్తం రెండు లక్షల 30 వేల ఓటర్లలో ఓసీల సంఖ్య 25 వేల లోపే. అందుకే బీసీ అభ్యర్థిని దింపాలని కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. మునుగోడు నుంచి బీసీ నేతలైన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ టికెట్ ఆశించారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత జోరుగా జనంలోకి వెళ్లిన ఈ బీ,సీ నేతలు… కూసుకుంట్లకు టికెట్ ఖరారైందన్న ప్రచారంతో కొన్ని రోజులుగా మునుగోడులో పెద్దగా తిరగడం లేదు. అయితే తాజాగా మారిన పరిణామాలతో మళ్లీ జనం బాట పట్టారు. మునుగోడులో గౌడ్ లకు బీహార్ తాటి విత్తనాలు పంపిణి చేశారు బూర నర్సయ్య గౌడ్. నియోజకవర్గం మొత్తం పంపిణి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ వ్యూహం ప్రకారం బూర, కర్నె, నారబోయినలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- కాపురానికి వెళ్లడం లేదని కూతురిని చంపేసిన తండ్రి
- మల్ రెడ్డి చూపు బీజేపీ వైపు… మంత్రి శ్రీనివాస్ తో మల్ రెడ్డి మంతనాలు
- గాయత్రి కేసులో మరో ట్విస్ట్.. గచ్చిబౌలి సీఐపై ఆరోపణలు
- కాళేశ్వరం ప్రాజెక్టును మూసుకోవాల్సిందేనా! రిటైర్డ్ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు
- మునుగోడుకు నేతల తాకిడి… పోటాపోటీగా సాయం! అంతా ఎన్నికల మహిమ?
2 Comments