
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో అలజడి సృష్టిస్తోంది. ఈ కేసు విషయమై హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు సార్లు పెద్దఎత్తున దాడులు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నగరంలో సోదాలు నిర్వహిస్తోంది. నగరంలోని 10 చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. 3 ఐటీ కంపెనీలతో పాటు కరీంనగర్‌కు చెందిన బిల్డర్ల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరో 2 రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
Read Also : ఖమ్మం జిల్లాలో దారుణం… లిఫ్ట్ అడిగి విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య
ఈ సోదాల కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అధికారుల బృందాలు వచ్చాయి. 15 రోజుల వ్యవధిలోనే నగరంలో ఈడీ అధికారులు సోదాలు చేయటం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై ఆగస్టు 19న సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో జరిగిన అక్రమాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంపై ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్’ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది.
Also Read : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే పాదయాత్ర అప్పండి…. వైఎస్ షర్మిల సవాల్
ఇందులో భాగంగానే సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో మొదటగా ఈడీ అధికారులు సోదాలు జరిపారు. సెప్టెంబర్ 16న కూడా ఈడీ అధికారులు హైదరాబాద్‌లో పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు. ఆ ఒక్కరోజే దేశవ్యాప్తంగా మొత్తం 40 ప్రాంతాల్లో సోదాలు చేశారు. కేవలం హైదరాబాద్‌లోనే 25 బృందాలుగా ఏర్పడిన ఈడీ అధికారులు.. పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. అనంతరం 18న మరోసారి పలువురి ఇళ్లలో సోదాలు చేశారు. ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైని 14వ నిందితునిగా పేర్కొన్నందున ఆయన వ్యాపార భాగస్వాముల ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.
Read Also : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ నూతన డిప్యూటీ స్పీకర్ గా వీరభద్రస్వామి
రామచంద్ర పిళ్లైని 18న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. లిక్కర్ కేసులో ఆయన పాత్రపై ప్రశ్నించారు. రాబిన్ డిస్లరీ పేరుతో వ్యాపారం చేసిన రామచంద్ర పిళ్లైకి.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో లింకులు ఉన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి.. ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు రామచంద్ర పిళ్లై పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇండో స్పిరిట్ తోపాటు.. కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి రూ.2 కోట్ల 30 లక్షలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- కాన్పు పోయమంటే కాటికి పంపారు… గర్భిణి పొట్టపై కాళ్లతో తొక్కిన నర్సులు
- యువతి గొంతు కోసిన ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ పీఏ
- ఉద్యమకారుడి బిడ్డకు పేరు పెట్టి బట్టలు పెట్టిన కేసీఆర్
- అక్టోబర్ రెండు నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పాదాభివందనం… యాక్షన్ ప్లాన్ రెడీ
- మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు