
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలనే ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 నిబంధనను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రముఖ పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్ కే పురుషోత్తమ్ రెడ్డి సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు..ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు భారత ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.
Read More : కేసీఆర్ ఖజానాకు అప్పనంగా 14 వందల కోట్లు! మద్యమా మజాకా..
ఈ ఏడాది ప్రారంభంలో జమ్ము కశ్మీర్‌లో డీ లిమిటేషన్ ప్రక్రియను సవాలు చేసిన WP(C) 237/2022తో ఈ పిటీషన్‌ను ట్యాగ్ చేయవచ్చని కోర్టు తెలిపింది. జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2019లో పొందుపర్చిన విధంగా జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 83 నుంచి 90కు పెంచేలా 2020లో ఏర్పాటైన డీ లిమిటేషన్ ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం 2022 మే 5న నోటిఫై చేసింది.అయితే తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుదల అనేది ఏపీ చట్టంలోని సెక్షన్ 26 నిబంధన, రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ నిబంధనలకు లోబడి ఉండాలని..దాంతో 2031 తరువాత జరిగే తొలి సెన్సస్ వరకూ అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Read More : మోడీ వేస్ట్.. సీజేఐ గ్రేట్! సీఎం కేసీఆర్ సంచలనం..
ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటీషన్ విచారణకు స్వీకరించడంతో కేంద్రానికి రెండే అవకాశాలున్నాయి. మొదటిది కశ్మీర్ డీ లిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగం, చట్టాన్ని ఉల్లంఘించినట్టు తీర్పు వెలువడే అవకాశముంది. అదే జరిగితే కశ్మీర్ ఎన్నికలు ఇప్పుడున్న అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా జరగాలి. లేదా కశ్మీర్‌లో సీట్ల సంఖ్యను పెంచేందుకు అవసరమైన రాజ్యాంగ, చట్టబద్ధమైన సవరణ కోసం కేంద్ర ప్రయత్నిస్తే..అది తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తించనుంది. సీట్ల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 153కు పెరగనుండగా, ఏపీలో 175 నుంచి 225కు పెరుగుతాయి
ఇవి కూడా చదవండి …
- వ్యభిచారం చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలకు గుండు… నల్గొండ జిల్లాలో దారుణం
- మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?
- రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నిలబడుతుందా? లాయర్లు ఏం చెబుతున్నారు?
- త్వరలో ప్రేక్షకుల ముందుకు… సప్తగిరి ‘గూడుపుఠాణి’
- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం