
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే తన పాదయాత్ర ఆపాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ చేశారు. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేపడుతున్న పాదయాత్ర సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గం నుంచి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది.
Also Read : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ నూతన డిప్యూటీ స్పీకర్ గా వీరభద్రస్వామి
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పాలమూరు ఎమ్మెల్యేలు చేతకాని దద్దమ్మలని మండిపడ్డారు. వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే తనపై స్పీకర్‌కి ఫిర్యాదు చేశారన్నారు. తన పాదయాత్రను ఆపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని.. వారికి దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు.
Read Also : కాన్పు పోయమంటే కాటికి పంపారు… గర్భిణి పొట్టపై కాళ్లతో తొక్కిన నర్సులు
తన పాదయాత్రతో బండారం బయటపడుతుందని వారికి భయం పట్టుకుందని, అందుకే పాదయాత్ర ఆపేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌టీపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి :
- యువతి గొంతు కోసిన ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ పీఏ
- కేసీఆర్ అభినవ అంబేద్కరట… బరి తెగించిన సంగారెడ్డి కలెక్టర్
- వైఎస్సార్ ను హత్య చేశారు.. నన్ను చంపాలని చూస్తున్నారు! షర్మిల సంచలన ఆరోపణలు..
- ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే… బిల్డింగ్ పర్మిషన్ కోసం 10 వేలు డిమాండ్..
- సమన్వయం లేదు.. ఇలాగైతే గెలవలేం! మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ నేతలకు అమిత్ షా క్లాస్..

One Comment