
క్రైమ్ మిర్రర్, ఖమ్మం జిల్లా ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ముదిగొండ మండలం బాణాపురంలో ఓ వ్యక్తి మరో వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడు. వలభి సమీపంలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనారుడిని లిఫ్ట్ అడగాడు. మనవాత దృక్పథంపో అతను లిఫ్ట్ ఇచ్చాడు. కొంతదూరం వెళ్లాక నిందితుడు వాహనదారుడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో వాహనదారుడు వెంటనే స్పృహ తప్పిపోయాడు.
Read Also : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే పాదయాత్ర అప్పండి…. వైఎస్ షర్మిల సవాల్
ఆ తర్వాత దుండగుడు ఆ బైక్‌తో పరారయ్యాడు. పడి ఉన్న వ్యక్తి చూసిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు చింతకాని మండల వాసి జమాల్ సాహెబ్ (40)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Also Read : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ నూతన డిప్యూటీ స్పీకర్ గా వీరభద్రస్వామి
దుండగుడు గుర్తుపట్టకుండా మాస్క్ ధరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్నాళ్లూ కత్తులతో నరికి, తుపాకీ కాల్చి, విషమిచ్చి చంపడం వంటి హత్యలే చూస్తూ వచ్చాం. ఈ ఘటన గురించి తెలియగానే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- కాన్పు పోయమంటే కాటికి పంపారు… గర్భిణి పొట్టపై కాళ్లతో తొక్కిన నర్సులు
- యువతి గొంతు కోసిన ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ పీఏ
- నాణ్యతా లోపం విరిగిపడ్డ బ్రిడ్జ్…. రాకపోకలకు అంతరాయం, ఇబ్బంది పడుతున్న ప్రజలు.
- అక్టోబర్ రెండు నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పాదాభివందనం… యాక్షన్ ప్లాన్ రెడీ
- భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్ష చూపడం దుర్మార్గం… బక్కని నర్సింహులు