
క్రైమ్ మిర్రర్, నల్గొండ : నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెర్వు అన్నారంకి చెందిన శిరసు అఖిల(21)తొలి కాన్పు కోసం ఈ నెల 9వ తేదీన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమె కి ఈ నెల 12 వ తేదీన పురిటి నొప్పులు రావడంతో అక్కడే ఉన్న అఖిల అత్తమ్మ పూలమ్మ నర్సులకి విషయం చెప్పింది. నర్సులు కోపంగా నొప్పులు రాగానే కాన్పు చేయాలా? అలా అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లండి అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అత్త మామలని భూతులు తిట్టారు.
Read Also : యువతి గొంతు కోసిన ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ పీఏ
అప్పటికి కూడా కాన్పు చేయాలనే ఆలోచనరాని నర్సులు మొబైల్ వాడుకుంటు కాలక్షేపం చేశారు. చివరికి అఖిల బెడ్ దగ్గర కొచ్చి పడుకున్నప్పుడు తెల్వదా.. ఇప్పుడు మొత్తుకుంటున్నావు అని నర్సులు నీచంగా మాట్లాడుతూ అత్తమ్మ పూలమ్మ చూస్తుండగానే కాలితో తొక్కుతూ వత్తేయడం తో కడుపు పై ఒత్తిడి పెరిగి తీవ్ర రక్తస్రావం అయింది. మగ బిడ్డ కు జన్మనిచ్చిన అఖిల అపస్మారక స్థితిలోకి వెళ్లింది.ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే పురుడు పోయాల్సిన నర్సులు ఇక పట్టించుకోకుండా ఆ ప్రసూతి మహిళను నరకయాతను గురి చేశారు.
Also Read : NTV చైర్మెన్ ను బహిష్కరించిన జూబ్లీహిల్స్ క్లబ్
అఖిల భర్త పరిస్థితి గమనించి హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ కి ఫోన్ చేసాడు లచ్చు నాయక్ స్పందించి డ్యూటీ డాక్టర్ కి ఫోన్ చేశాడు. డ్యూటీ డాక్టర్ ఆలస్యంగా స్పందించి ICUలో చేర్చి చికిత్స చేశాడు అయినా రక్త స్రావం ఆగలేదు చివరకు గాంధీ హాస్పిటల్ తీసుకువెళితే ఈ నెల 16 వ తేదీన చనిపోయిందిదీనితో అఖిల బంధువులు నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ ముందు నిరసన చేస్తూ నిర్లక్ష్యం చేసిన డాక్టర్, నర్సులని జాబ్ ల నుండి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- కేసీఆర్ అభినవ అంబేద్కరట… బరి తెగించిన సంగారెడ్డి కలెక్టర్
- వైఎస్సార్ ను హత్య చేశారు.. నన్ను చంపాలని చూస్తున్నారు! షర్మిల సంచలన ఆరోపణలు..
- ఉద్యమకారుడి బిడ్డకు పేరు పెట్టి బట్టలు పెట్టిన కేసీఆర్
- ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే… బిల్డింగ్ పర్మిషన్ కోసం 10 వేలు డిమాండ్..
- సమన్వయం లేదు.. ఇలాగైతే గెలవలేం! మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ నేతలకు అమిత్ షా క్లాస్..