
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ నూతన డిప్యూటీ స్పీకర్‌గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఈ పదవి ఏకగ్రీవం అయ్యింది. ఈ విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో ప్రకటించారు.
Read Also : కాన్పు పోయమంటే కాటికి పంపారు… గర్భిణి పొట్టపై కాళ్లతో తొక్కిన నర్సులు
కోలగట్ల వీరభద్రస్వామి రెండు నామినేసన్లు దాఖలు చేశారని.. మిగిలిన ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం వీరభద్రస్వామిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీఎల్పీ నేత అచ్చెన్నాయుడు వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. వీరభద్ర స్వామిని తోటి శాసనసభ్యులు అభినందించారు.
Also Read : యువతి గొంతు కోసిన ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ పీఏ
గత గురువారం డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం దక్కింది. ఆయన శుక్రవారం నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. వీరభద్రస్వామి ఒక్కరు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం అయ్యింది.
ఇవి కూడా చదవండి :
- NTV చైర్మెన్ ను బహిష్కరించిన జూబ్లీహిల్స్ క్లబ్
- కేసీఆర్ అభినవ అంబేద్కరట… బరి తెగించిన సంగారెడ్డి కలెక్టర్
- వైఎస్సార్ ను హత్య చేశారు.. నన్ను చంపాలని చూస్తున్నారు! షర్మిల సంచలన ఆరోపణలు..
- ఉద్యమకారుడి బిడ్డకు పేరు పెట్టి బట్టలు పెట్టిన కేసీఆర్
- ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే… బిల్డింగ్ పర్మిషన్ కోసం 10 వేలు డిమాండ్..