HyderabadTelangana

విశ్వకర్మ చరిత్ర

క్రైమ్ మిర్రర్, ఇంటర్ నెట్ డెస్క్: శ్లో పుర్వావనా త్సనగః దక్షణా త్సనాతనః అపరా దహభువః ఉద్విచ్యాం ఉర్ధవాత్సపర్నఃతూర్పు ముఖమునందు సాన ఋషి దక్షిణముఖమునందు సనాతన ఋషి పశ్చిమ ముఖమునందు అహభూన ఋషి ఉత్తరముకమునందు ప్రత్నస బ్రహ్మర్షి యను పి బ్రహ్మయు ఉర్డ్వముకమైన ఈశానమున సుపర్ణ బ్రహ్మర్షియను విశ్వజ్ఞ బ్రాహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినది.

ad 728x120 SRI copy - Crime Mirror

ఋగ్వేదంలోనీ పదవ మండలం 81.82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్ని వివరిస్తాయి అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు.

విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమం వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుంపరం.

కైలాస గిరి పై పరమేశ్వరుడు ఏకాగ్రచితుడై ధ్యాన నిష్టుడైన సమయమున షణ్ముఖుడు తండ్రిని సమీపించి ఓ తండ్రి మేమెల్లరము పరమాత్మ స్వరూపులమైన మిమ్ములను విష్ణువును బ్రహ్మను ఇంకను ఎవరిని ఇష్టానుసారముగా సర్వదేవతలను ఆరాధించుచుండగా సర్వజ్ఞులైన తమరు ఎవరిని గూర్చి ధ్యానించుచున్నారు అని ప్రశ్నింపగా స్థిర చిత్తుడైన శంకరుడు కుమారా నీవు భావించినట్లు నేను బ్రహ్మ విష్ణు ఇంద్ర సూర్యులు పరిపూర్ణులము కాము సర్వశక్తి సమన్వితులము కాము ఏలనగా బ్రహ్మ సృష్టి విష్ణు పోషణ ఇంద్రుడు లోకపాలన సూర్యుడు ప్రకాశము నేను లయకార్యములను మాత్రమే చేయ శక్తి కలవారమే కానీ ఒకరి కార్యము మరొకరము చేయలేని ఆశక్తులము కావున మాకు ఈ జన్మము ను రూపము షణ్ముఖ సాధన చిత్తుడవై శ్రద్ధతో విని తరింపుము.

ఈ విధముగా విరాట్ స్వరూపంగా సహస్ర శీరుడైన స్వయంభుగా అవతరించిన వారే శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు…… శృతి*అధానంత వీర్యస్య శ్రీమన్మహా విశ్వకర్మహా అచంత్య పరిమిత శక్త్యభియమానస్య మహాదాకాశ మధ్య పరిభ్రమణానం అనేక కోటి బ్రహ్మాండానం ఏకతమే వ్యక్తావ్యక్త మహాకార పృథ్వి వ్యక్రేజు వాయుర్యకాశాది ఆవరణేరావృతే తదిష్టాన భూత విశ్వకర్మ పరమాత్మ ప్రతిబింబిత దైవతైః మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ పంచ బ్రహ్మధి పరికల్పితే బ్రహ్మ విష్ణు రుద్రెద్రాధిత్య పంచ మూర్తి భిః పరిపాలితే పరిపాలితే అస్మిన్ మహా బ్రహ్మాండ ఖండయోర్మధ్యే ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తి అభిదాన పంచ మహాశక్తి బి రావ్రుతే!!(మన సూత్ర ప్రయోగం) అనంతము అపరిమితము అయినా ఊహకందని బ్రహ్మాండమున తేజోమయ విశ్వకర్మ అనేక బ్రహ్మాండములను తాను ఒక్కడైనా ఆధారమై నుండి నిరాకార సాకార బేధంబులతో భూ జల తేజు వాయు ఆకాశాది ఆవరణములను కల్పించి ధదిష్టాన దేవతలుగా మను మయా వస్తా శిల్పి విశ్వజ్ఞ పంచ బ్రహ్మ లను వారికి ప్రతినిధులుగా రుద్ర విష్ణు బ్రహ్మ ఇంద్ర ఆదిత్యులను సృష్టించి ఈ మహా దాకాశ మధ్యమున పరిపూర్ణుడై భూలోక భువర్లోక స్వర్గలోక మహర్లోక తపోలోక జనలోక సత్యలోకాది ఉర్ధ్వలోకములు అతల వితల తలా తల మహాతల పాతాలాది అధోలోకములను అవల అతీతమైన జనలోకంబున దివ్య శక్తి సమన్వితమైన బంగారు శిఖరంతో తేజరిల్లు మేరు శిఖరంబున దివ్య రత్న మణిమయ సింహాసనుడై యున్న శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు పంచ తత్వాత్మకుడై సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములను పంచముఖములతో ప్రాక్ దక్షిణ పక్షిమ ఉత్తర ఈశానములన్నిడి పంచ దిక్కులతో రుగ్ యజు సామ అధర్వణ రణవాది పంచవేదములతో స్పటిక నీలా తామ ధూమ సువర్ణాది పంచవర్ణములతో పృథ్వి అప్ప తేజో వాయు రాకాశాది పంచా భూత తత్వములతో తొక్కు చెక్కు శ్రవణ జిహ్వ గణాది పంచా జ్ఞానేంద్రియములతో వాక్కు కానీ పాద వాయు గుహ్యాధి పంచ కర్మేంద్రియములతో శబ్ద స్పర్శ రూప రస గందాది తన్మాత్రలతో దశ భుజములు దశ హస్తములు కలిగి శూలము దంకా అభయ వరద చక్ర అబ్ద కోశ లేఖిని మొదలగు ఆయుధములు ధరించి దేవా దాన యజ్ఞ కిన్నెర కింపురుష మానవాది సమస్త జీవ జాలంబులను సృష్టించి రక్షించు విశ్వాన్ని కర్మానియాస్యాన విశ్వకర్మ అనగా సమస్త కర్మలు కలవాడు ఆ సమస్తములైన కర్మములే వి అనగా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాది కర్మలు అని అర్థం అంతేగాక అయం దేవాన మప మపహస్తయే యువజన నామ్ రోదని విశ్వ శంభువా వియో మమమే రజస సుక్రీతుయ యాజరేమి సంబవేధి సమాన్సాచే(ఋగ్వేద ( 2.160) సకల జీవులకు సుఖమును కలిగించు భూమి ఆకాశము ఏ దేవుడు పుట్టించెనొ ఏ దేవుడు సర్వ ప్రాణుల సౌఖ్యమునుకై ఆ రెండు లోకములను దృఢమైన క్రమము దప్పనియట్లూ బిగించియుంచెను అతడు దేవతలలో గొప్పవాడు.

విశ్వకర్మ భగవానుని యొక్క వారి వంశమును గూర్చి తెలుపెదను సాకార పరబ్రహ్మగా అవతరించి విశ్వకర్మ సర్వలోక పాలన కొరకు తన అంశచే మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ పంచ బ్రహ్మ లకు వారి భార్యలుగా ఆదిశక్తి పరాశక్తి విద్యాసక్తి క్రియశక్తి జ్ఞాన శక్తి సృష్టించి వారికి అంశాలుగా రుద్ర విష్ణు బ్రహ్మ ఇంద్ర సూర్యది మూర్తులు వారి భార్యలుగా ఉమా లక్ష్మీ వాణి శచి సౌజ్ఞ ఈ దేవతామూర్తులను వారి గోత్రములుగా సానగా సనాతన ఆహా భువనస ప్రత్నసా సుపర్ణస పంచ బ్రహ్మ ఋషులను సృష్టించి లోక పాలన బాధ్యతలను అప్పగించెను కావున మనం ప్రతినిత్యం సంధ్యావందనాది పూజ క్రతువులతో వారి ప్రథమ దేవతలుగా ధ్యానించుచున్నాము ఓం మధాశక్తి మనుబ్రహ్మ స్వరూపభ్యాం ఓం పరాశక్తి మయ బ్రహ్మ స్వరూపభ్యాం నమః ఓం ఇచ్చాశక్తి స్వష్ట బ్రహ్మ స్వరూపభ్యాం వాణి హిరణ్యభ్యం నమః ఓం క్రియాశక్తి శిల్పి బ్రహ్మ స్వరూపాభ్యాం శశి పురంధరాభ్యం నమః ఓం జ్ఞానాశక్తి విశ్వజ్ఞ బ్రహ్మ స్వరూపాభ్యం సౌజ్ఞ భాస్కరాభ్యం నమః అదేవిధంగా అదేవిధంగా విశ్వకర్మచే సృష్టించబడిన సానగా సనాతన అహబూవనస రత్నస సూపర్నస పంచ బ్రహ్మలు సర్వమానవ జీవనార్థం తమ వంశీయులకు (విశ్వబ్రాహ్మణులకు) గోత్రసులైన మన వంశములకు సానగా గోత్రధారులైన అయ్యో ఇనుప వృత్తిని మయ బ్రహ్మ వంశీయులకు సనాతన గోత్రదారులై గారు కొయ్య వృత్తిని త్వష్ట బ్రహ్మ వంశీలకు అహబూనస గోత్రదారులై తామ్ర రాగి కంచు వృత్తిని శిల్పి బ్రహ్మ వంశీయులకు ప్రత్నస గోత్రదారులై శిల రాతి శిల్ప వృత్తిని విశ్వగ్నం బ్రహ్మ వంశీలకు సూపర్ నస గోత్రధారులైన సువర్ణ ఆభరణ వృత్తిని నియమించింరి..విరాట్ సృష్టికర్త అయిన విశ్వకర్మ జయంతి యజ్ఞ యాగాదులను ఆయన పంచముఖ మూల నుంచి ఉద్భవించిన మను మయ స్వష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మ లకు జయంతులుగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము సెప్టెంబరు 17 న దేవ శిల్పి విశ్వకర్మ పూజలను జరుపుకుంటున్నాము ఇవి ముఖ్యంగా కర్మాగారాలు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు వారికి పనిముట్లను విశ్వకర్మ ముందు నుంచి పూజిస్తారు సర్వేజనా సుఖినోభవంతు..

– బ్రహ్మశ్రీ కొండోజు సాల్వా ఆచార్య జ్యోతిష్య వాస్తు పురోహిత పంచాంగ సిద్ధాంతి

ఇవి కూడా చదవండి..

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.