
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న దానిపై క్లారిటీ లేదు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారా లేక గుజరాత్ అసెంబ్లీ పోల్స్ తో పాటు జరుగుతుందా అన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. మునుగోడులో సర్వే చేయించిన బీజేపీ హైకమాండ్.. పార్టీ పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో ఉప ఎన్నికను మరింత ఆలస్యం చేయవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.
Read More : పురుగు కుడితే ప్రాణాలు పోతాయంటూ ప్రచారం…. అవాస్తవమని తెలిపిన ఏపీ శాస్త్రవేత్తలు
పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ప్రసంగం తర్వాత హరిత ప్లాజా నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేవలం 19 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలతో పాటు మునుగోడు ఉప ఎన్నికపైనే పార్టీ నేతలతో అమిత్ షా చర్చించారు. ఈ సమావేశం హాట్ హాట్ గా సాగిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందన్న దానిపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారని సమాచారం. అక్టోబర్ చివరలో మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని.. పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమిత్ షా ఆదేశించారని తెలుస్తోంది.
Read More : బిజేపికి వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఫ్లెక్సిల కలకలం….
గంటన్నర పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య సమన్యం లేదని.. ఇలాగైతే గెలవడం కష్టమని తేల్చి చెప్పారట. ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మునుగోడులో ప్రచారం పెంచాలని సూచించిన అమిత్ షా.. పార్టీ తరుపున కమిటీని నియమించాలని ఆదేశించారట. మునుగోడులో గెలిచి తీరాలని చెప్పిన అమిత్ షా.. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారట. ప్రతి గ్రామానికి ముగ్గురు నేతలను ఇంచార్జులుగా నియమించాలని సునీల్ బన్సల్ ను ఆదేశించారని సమాచారం.
Read More : విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి… అమిత్ షా
జాతీయ నాయకత్వం అంచనాలను అనుగుణంగా పని చేయలేకపోతున్నారని.. లక్ష్యాలను అందులేకపోతున్నారన్నంటూ బాద్ షా క్లాస్ పీకారని అంటున్నారు. పార్టీ సమన్వయం లోపించిందని.. కొందరు నేతలు సరిగా పని చేయడం లేదని మండిపడ్డారని సమాచారం. కేసీఆర్ పాలనపై గుర్రుగా ఉన్న జనాలు బీజేపీ పట్ల ఆసక్తిగా ఉన్నా.. నేతలు సరిగా పనిచేయడం లేదని అన్నారట. బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని.. మిగితా నేతలకు మరింతగా కష్టపడాలని సూచించారట. కష్టపడితేనే ఫలితం ఉంటుందని.. అలాంటి నేతలకే పార్టీలో మంచి అవకాశాలు వస్తాయని అమిత్ షా తేల్చి చెప్పారట. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ జనాల్లోకి వెళ్లాలని ఆదేశించారని సమాచారం.క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి లంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా కీలక సూచనలు చేశారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే… బిల్డింగ్ పర్మిషన్ కోసం 10 వేలు డిమాండ్..
- గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు.. మోడీకి ఉరేనంటూ కేసీఆర్ సంచలన ప్రకటన
- నాణ్యతా లోపం విరిగిపడ్డ బ్రిడ్జ్…. రాకపోకలకు అంతరాయం, ఇబ్బంది పడుతున్న ప్రజలు.
- బిజేపి నేతలతో అమిత్ షా భేటీ…. మునుగోడు ఉపఎన్నికపై దిశానిర్దేశం
- అక్టోబర్ రెండు నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పాదాభివందనం… యాక్షన్ ప్లాన్ రెడీ