
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో తొలిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమిత్ షా వచ్చిన నేపథ్యంలో బిజెపికి వ్యతిరేకంగా పెరేడ్ గ్రౌండ్స్ పరిసరాలలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
Read Also : తెలంగాణ ఇలాగే అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోవాలి… సిఎం కేసిఆర్
సెప్టెంబర్ 17న తెలంగాణకు ఏమి ఇస్తారు? రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవి అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫ్లెక్సీలలో గోవా లిబరేషన్ డేకు కేంద్రం రూ.300 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణ విమోచన దినం అంటూ చెబుతున్న బిజెపి ప్రభుత్వం ఎందుకు ఒక్కరూపాయి ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలలో ప్రశ్నించారు. అమిత్‌షా తెలంగాణకు ఇవాళ ఏమైనా ఇస్తారా? అంటూ ఫ్లెక్సీల ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షాకు సూటి ప్రశ్నలు వేశారు.
Also Read : విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి… అమిత్ షా
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడంపై సిరిసిల్లలో జరిగిన తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలలో మంత్రి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని, వస్తూ ఏమైనా తెస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకోవడానికి మాత్రమే అమిత్ షా వస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలలో మత విద్వేషాలు రగల్చటం కోసం బిజెపి నాయకులు పని చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి :
- విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. సమైక్యత వేడుకల్లో దారుణం
- భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్ష చూపడం దుర్మార్గం… బక్కని నర్సింహులు
- సెప్టెంబర్ 17న కేసీఆర్ సంచలన ప్రకటన?
- గుజరాత్ మాజీ సిఎంతో ముఖ్యమంత్రి కేసిఆర్ భేటీ
- మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు
One Comment