
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : పెద్ద అంబర్ పేట మునిసిపాలిటీ లో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతి దరఖాస్తు ముందుకు కదలాలి అంటే అధికారుల చేతులు తడపడం అనివార్యంగా మారింది. లేకపోతే ఏవో కుంటి సాకులు చెప్పి, భవన నిర్మాణ అనుమతి దరఖాస్తును తిరస్కరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Also : గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు.. మోడీకి ఉరేనంటూ కేసీఆర్ సంచలన ప్రకటన
తనను మంచిగా చూసుకుంటే… తాను మంచిగానే ఉంటానని ఒక అధికారి పేర్కొనడం పరిశీలిస్తే, బహిరంగంగానే పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందే, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) నుంచి ఎల్ ఆర్ ఎస్ పొందినప్పటికీ, నాలా కన్జర్వేషన్ ఫీజులు చెల్లించాలి అంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు హుకుం జారీ చేయడంవిస్మయాన్ని కలిగిస్తోంది.
Also Read : సమన్వయం లేదు.. ఇలాగైతే గెలవలేం! మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ నేతలకు అమిత్ షా క్లాస్..
ఎల్ ఆర్ ఎస్ ద్వారానే, కన్జర్వేషన్, నాలా ఫీజులు చెల్లించడం జరుగుతుందని టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులే చెబుతున్నారు. అయినా పెద్ద అంబర్ పేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు మాత్రం, తమ రూటే సపరేటు అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణ అనుమతి కోసం చేతులు తడిపితే మాత్రం, ఇటువంటి కుంటిసాకులేవి చెప్పకుండా, పర్మిషన్ ఇస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా లంచం ఇవ్వకపోతే, టి ఎస్ బి పాస్ నిబంధనలకు విరుద్ధంగా, తాను సైట్ విజిట్ చేశాకే, భవన నిర్మాణ అనుమతి కోసం ప్రతిపాదిస్తానని చెబుతున్నారని పలువురు తెలిపారు.
Read Also : నాణ్యతా లోపం విరిగిపడ్డ బ్రిడ్జ్…. రాకపోకలకు అంతరాయం, ఇబ్బంది పడుతున్న ప్రజలు
నిబంధనల ప్రకారం భవన నిర్మాణ దారుడు, టి ఎస్ బి పాస్ ద్వారా మంజూరైన అనుమతులకు భిన్నంగా భవన నిర్మాణాలు చేపడితే, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చి వేసే అధికారం మున్సిపాలిటీలకు ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. అయినా నిబంధనలన్నీ గాలికి వదిలి వేసి, తాను సైట్ విజిట్ చేస్తానని పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ మున్సిపాలిటీ కమిషనర్ గా గతంలో విధులు నిర్వహించిన వ్యక్తి, భవన నిర్మాణ అనుమతుల కోసం లంచాలు తీసుకుంటూనే, ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నాను. ఇక ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారుల వంతు వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- బిజేపి నేతలతో అమిత్ షా భేటీ…. మునుగోడు ఉపఎన్నికపై దిశానిర్దేశం
- అక్టోబర్ రెండు నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పాదాభివందనం… యాక్షన్ ప్లాన్ రెడీ
- పురుగు కుడితే ప్రాణాలు పోతాయంటూ ప్రచారం…. అవాస్తవమని తెలిపిన ఏపీ శాస్త్రవేత్తలు
- తెలంగాణ ఇలాగే అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోవాలి… సిఎం కేసిఆర్
- విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి… అమిత్ షా