
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : అది ఒక మారుమూల గ్రామం, నిండా గంటెడు జనం లేని ఆ గ్రామంలో పెద్ద సమస్య వచ్చి పడింది. గత పది రోజుల క్రితం కురిసిన వర్షానికి వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఇంతకు ముందే అక్కడక్కడ గుంతలు పడిన ఈ బ్రిడ్జ్ ఒక్క సారిగా విరిగిపడింది. జిల్లాలోని మర్రిగూడ మండలం, వెంకెపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణం చేసిన ప్రభుత్వం వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది.
Read Also : బిజేపి నేతలతో అమిత్ షా భేటీ…. మునుగోడు ఉపఎన్నికపై దిశానిర్దేశం
రోడ్డు బాగానే ఉన్నా ప్రస్తుతం బ్రిడ్జ్ మాత్రం మధ్య భాగానికి కూలిపోయింది. గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఈ బ్రిడ్జ్ పై పలు చోట్ల రంద్రాలు కూడా పడ్డాయని స్థానికులు అంటున్నారు. బ్రిడ్జ్ నిర్మాణం జరిగే సమయంలో, వాగు నీరు అవతలికి వెళ్ళటానికి మధ్యలో పెద్ద పెద్ద రింగులు వేశారని స్థానికులు తెలిపారు. రింగుల క్రింది భాగంలో, రింగుల మధ్యలో సిమెంట్ వాడకపోవటం, కేవలం ఇసుక, మట్టి పొయ్యటమే బ్రిడ్జ్ కూలిపోవటానికి ప్రధాన కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కుప్ప కూలిన బ్రిడ్జ్ నిర్మాణం పరిశీలించిన పలువురు అనుభవజ్ఞులు కూడా నాణ్యతా లోపమనే అంటున్నారు.
Also Read : తెలంగాణ ఇలాగే అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోవాలి… సిఎం కేసిఆర్
ఈ మార్గం గుండా వెంకెపల్లి, వెంకెపల్లి తండా, కుదాబక్ష్పల్లి గ్రామాలే కాకుండా, రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలకు కూడా అనుసంధానమై ఉంది. ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ప్రధానంగా రెండు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రానికి రావాలంటే చుట్టూ తిరిగి రావలసి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా దూరం ప్రయాణం చేసిన ద్విచక్ర వాహనదారులు, బాటసారులు ఈ విరిగిన బ్రిడ్జ్ భీమ్ మీదుగా సాహసం చేస్తూ అవతలికి దాటుతున్నారు. ఇలా దాటే క్రమంలో మల్లీ ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశం లేకపోలేదని స్థానికులు అంటున్నారు.
Read Also : విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి… అమిత్ షా
ఇంత జరుగుతున్నా కనీసం హెచ్చరిక బోర్డులు కూడా అధికారులు అమర్చలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇంకా నీటి వరద తగ్గలేదని అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు పెట్టి, మరమ్మతు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శివన్నగూడెం రిజర్వాయర్ లో ఈ గ్రామం ముంపుకు గురి అవుతుంది కాబట్టే, ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వేరే ప్రాంతాలకు చెందిన వారు, రాత్రిళ్ళు ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ప్రజలు పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- అక్టోబర్ రెండు నుండి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పాదాభివందనం… యాక్షన్ ప్లాన్ రెడీ
- పురుగు కుడితే ప్రాణాలు పోతాయంటూ ప్రచారం…. అవాస్తవమని తెలిపిన ఏపీ శాస్త్రవేత్తలు
- బిజేపికి వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఫ్లెక్సిల కలకలం….
- విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. సమైక్యత వేడుకల్లో దారుణం
- మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు
One Comment