HyderabadTelangana

తెలంగాణ ఇలాగే అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోవాలి… సి‌ఎం కే‌సి‌ఆర్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కే‌సి‌ఆర్ జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ప్రసంగించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని మతోన్మాద శక్తుల చేతుల్లోకి వెళ్లనీయొద్దని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలు మరోసారి తమ బుద్ధి కుశలతను చూపే సమయం వచ్చిందన్నారు. ఏమాత్రం ఏమరపాటు వ్యవహరించినా.. రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్తుందని సీఎం హెచ్చరించారు.

సెప్టెంబర్ 17ను సైతం కొన్ని శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాచరికం నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి మళ్లిందన్న కేసీఆర్.. ఇటీవలే భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం అన్నారు.

Also Read : విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. సమైక్యత వేడుకల్లో దారుణం

దానికి కొనసాగింపుగానే తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు కొంత భాగం నేరుగా బ్రిటిషర్ల పాలనలో ఉంటే.. మరికొంత భాగం సంస్థానాల చేతుల్లో ఉండేదన్నారు. తెలంగాణ రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి మళ్లడానికి ప్రజలు ఎంతగానో పోరాడారన్నారు. తెలంగాణ పోరాట యోధులను ఆయన స్మరించుకున్నారు.

‘‘భారత్‌లో తెలంగాణ విలీనం తర్వాత 1956 వరకు తెలంగాణ సొంత రాష్ట్రంగా కొనసాగింది. రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. కానీ దశాబ్దంలోపే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. తెలంగాణ ప్రజలు సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో వివక్షకు గురయ్యారు.

Read Also : భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్ష చూపడం దుర్మార్గం… బక్కని నర్సింహులు

కేంద్రం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించకుండా వారిని అణచివేసింది. 2001లో నేనే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాను. ఆమరణ దీక్షకు దిగాను. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంద’’ని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ప్రజలు కొంచెం ఆదమరిస్తే.. ఏమవుతుందో చెప్పడానికి తెలంగాణ సమాజమే ఉదాహరణ అన్నారు. 58 ఏళ్లపాటు ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయని కేసీఆర్ ఆరోపించారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు సెప్టెంబర్ 17ను సైతం వాడుకుంటున్నాయని.. తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు.

Also Read : సెప్టెంబర్ 17న కేసీఆర్ సంచలన ప్రకటన?

తెలంగాణ సమాజం మరోసారి బుద్ధి కుశలతను చాటాలన్నారు. కుటిల ప్రయత్నాలను తిప్పి కొట్టాలన్నారు. లేదంటే సమాజం కల్లోలంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని మీకు వివరించడం నా గురుతర బాధ్యతగా గుర్తిస్తు్న్నానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఎన్నటికీ ఈ నేల శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలి తిప్పితే కల్లోలంలోకి వెళ్లకూడదు. తెలంగాణ ఇలాగే అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోవాలి. దేశ అభ్యున్నతి కోసం మనమంతా కృషి చేద్దాం. మనం పరస్పరం కాపాడుకుందాం. లోకంలోని సంపదను సమానంగా అనుభవిద్దాం’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి : 

  1. రేవంత్ రెడ్డి జీరో అవుతున్నారా.. సీనియర్లకే హైకమాండ్ వత్తాసా?
  2. గుజరాత్ మాజీ సి‌ఎంతో ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ భేటీ
  3. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులు!
  4. మధుయాష్కీకి షాక్…. ఆయన స్థానంలో దామోదర్ రెడ్డికి భాద్యతలు
  5. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి…. రేవంత్ వ్యాక్యలపై సీనియర్లు సీరియస్ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.